Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సొరకాయ తినేవారు ఇది ఖచ్చితంగా చదవాల్సిందే...

మంగళవారం, 14 నవంబరు 2017 (21:23 IST)

Widgets Magazine
bottle gourd

సొరకాయ లేదా అనపకాయ. సొరకాయను తెలంగాణా ప్రాంతంలో అనపకాయ అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం లాజనేరియా వల్గారిస్ అంటారు. దీనినే ఇంగ్లీష్‌లో బాటిల్ గార్డ్ అంటారు. వేదకాలం నుంచి మన దేశంలో సొరకాయను సాగు చేస్తున్నారు. మానవజాతికి ఏనాడో పరిచయమైన అతి ప్రాచీనమైన కూరగాయ సొరకాయ.
 
సొరకాయ పుట్టింది ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ క్రీస్తు పూర్వం 11 వేల నుంచి 13 వేల సంవత్సరంలో పెరులో సొరకాయ సాగు జరిగిందని పురాతన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎండిన సొరకాయపై తొడుగును సొరకాయ బుర్ర అని అంటారు. దీనిలో నీరు పోసుకుని పొలాలకు తీసుకుని అలవాటు చాలామందికి ఉంది. అందులోని నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. అందుకే సొరకాయను నేచురల్ వాటర్ బాటిల్, నేచురల్ మినీకూలర్‌గా చెబుతుంటారు. పూర్వకాలంలో పెద్దవారు సొరకాయలోని నీళ్ళు తాగబట్టే మనవాళ్ళు అన్ని సంవత్సరాల పాటు బతికేవారట. 
 
సొరకాయ కూరే కాదు.. సొర బూరలు కూడా చాలా ఫేమస్. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. శరీరం విపరీతమైన వేడితో బాధపడేవారు దీని రసం తాగడం వల్ల శరీరాన్ని కూల్ చేస్తుంది. సొరకాయలో నీటి శాతం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. సొరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 
 
మెదడులోని కణాలు ఉత్తేజితమవుతాయి. ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుండటం, చాలామందికి నిద్రపట్టకుండా కళ్ళు మంటలు వస్తాయి. నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్ర సమస్యను అధిగమించవచ్చు. సొరకాయ సులభంగా జీర్ణమవుతుంది. మూత్రనాల జబ్బులకు సొరకాయ చాలా మంచిది. మలబద్థక, కాలేయ సమస్యను ఉన్నవారికి సొరకాయ చాలా మంచిది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పని ఒత్తిడి అనిపించినప్పుడు ఇవి తింటే సరి...

ఎండు ద్రాక్ష రుచికి పుల్లగా, తియ్యగా ఉంటాయి. అందరూ ఇష్టపడే ఎండు ద్రాక్షలో అద్భుతమైన ...

news

రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు వాడితే ఆ హార్మోన్‌పై..?

ప్రస్తుతం టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైపోతోంది. అయితే వీటిలోని బ్లూ లైట్ వల్ల ...

news

వర్షాకాలంలోనూ దాహం తగట్లేదా?

వర్షాకాలంలో కూడా దాహం వేస్తుందా? నీళ్లు గ్లాసులు గ్లాసులు తాగినా దాహం తీరట్లేదా? అయితే ...

news

#WorldDiabetesDay : తక్కువ కేలరీల ఆహారంతో డయాబెటీస్‌కు చెక్

ప్రపంచ డయాబెటీస్ డే ను పురస్కరించుకుని మధుమేహ రోగులకు వైద్యులు ఓ శుభవార్త తెలిపారు. ...

Widgets Magazine