డెంగీ జ్వరం వైద్యానికి రూ.16 లక్షల బిల్లు... ఎక్కడ?

ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రి డెంగీ జ్వరానికి వైద్యం చేసినందుకు ఏకంగా రూ.16 లక్షల బిల్లు వసూలు చేసింది. అలాగనీ బాలుడిని ప్రాణాలతో అప్పగించింరా? అంటే అదీలేదు.

dengue mosquito
pnr| Last Updated: శనివారం, 23 డిశెంబరు 2017 (17:40 IST)
ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రి డెంగీ జ్వరానికి వైద్యం చేసినందుకు ఏకంగా రూ.16 లక్షల బిల్లు వసూలు చేసింది. అలాగనీ బాలుడిని ప్రాణాలతో అప్పగించింరా? అంటే అదీలేదు. దీంతో మృతుని తండ్రి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అదేసమయంలో ఆస్పత్రి ఛైర్మెన్‌తో పాటు ఆస్పత్రి చిన్నపిల్లల విభాగం వైద్యులు, సహాయక సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

రాజస్థాన్ రాష్ట్రంలోని ధౌల్పార్ జిల్లాకు చెందిన గోపేంద్ర సింగ్ పర్మర్ అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు సూర్య ప్రతాప్ అనే ఏడేళ్ళ కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు డెంగీ జ్వరంబారిన పడటంతో స్థానికంగా పలు ఆస్పత్రుల్లో చూపించి, చివరకు ఢిల్లీలోని మేదాంతా ఆస్పత్రికి చేర్పించారు. ఈ ఆస్పత్రిలో 22 రోజుల పాటు చికిత్స చేసినప్పటికీ ఆ బాలుడు కోలుకోలేదు. కానీ, వైద్య ఖర్చులు మాత్రం పెరిగిపోతూ వచ్చాయి. 22 రోజులకు ఏకంగా రూ.15.88 లక్షలను వైద్య ఖర్చుల కింద ఆస్పత్రి వసూలు చేసింది.

ఆపై వైద్య ఖర్చులు భరించలేక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి గత నెల 20వ తేదీన చేర్చగా, 22వ తేదీన ఆ బాలుడు చనిపోయాడు. దీంతో ఆ తండ్రి తీవ్ర మానసిక క్షోభకుగురై, మేదాంత ఆస్పత్రి యామాన్యంపై ఢిల్లీ సదార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు మెడికల్ బిల్లులను పరిశీలిస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.


దీనిపై మరింత చదవండి :