శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (14:58 IST)

పడక గదిలో యువత ఎందుకు తుస్‌మంటున్నారంటే...

నేటికాలపు యువతలో శృంగార కోర్కెలు బాగా తగ్గిపోతున్నాయి. యుక్తవయసులోనే పడక గదిలో శృంగారాన్ని ఎంజాయ్ చేయలేక తుస్‌మంటూ తేలిపోతున్నారు. దీనికి కారణం మానసిక ఒత్తిడితో పాటు పెరుగుతున్న పని ఒత్తిడే ప్రధాన కారణం. ఈ కారణంగానే యువతీ యువకుల్లో శృంగార కోర్కెలు పూర్తిగా తగ్గిపోతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. 
 
వీటితో పాటు ఫాస్ట్‌ఫుడ్స్‌‌ను అమితంగా ఆరగించడం, వ్యాయామం లేకపోవడం, కంప్యూటర్‌ ముందు గంటల తరబడి గడపడం వల్ల యువతలో శృంగారేచ్చ తగ్గుతున్నది. యువకుల్లో వీర్యకణాల లోపం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నది. సంతానం లేని నవదంపతుల సంఖ్య పెరిగిపోతుందని వారు చెబుతున్నారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆహారపుటలవాట్లు మార్చుకోవాలని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని వారు సలహా ఇస్తున్నారు.
 
ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే... మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం, నిత్యం వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానానికి గుడ్‌బై చెప్పడం, రోజూ సూర్యోదయ వేళలో జీవిత భాగస్వామితో కలిసి కాసేపు వ్యాహ్యాళికి వెళ్లడం, వ్యాయామం కుదరకపోతే కనీసం లిఫ్ట్‌ వాడకం మానేసి మెట్లు ఎక్కడం, కుదిరితే ధ్యానం, యోగా వంటివి చేయడం వంటి వాటివల్ల తిరిగి పునరుత్తేజం పొందవచ్చని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.