గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: సోమవారం, 7 ఆగస్టు 2017 (21:39 IST)

వెల్లుల్లి, వేపనూనె చాలు.... దోమలు పారిపోతాయ్... ఏం చేయాలి?

వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద ఎక్కువగా వుంటుంది. చాలామంది ఈ దోమలను పారదోలేందుకు ఏవో దోమల మందులు వాడుతుంటారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందువల్ల నీళ్ల ట్యాంకులపై ఎప్పుడూ మూతలు పెట్టి వుంచాలి. కూలర్లలో వుండే నీటిని కూడా తీసేయడం మంచిది. ఖాళీగా వ

వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద ఎక్కువగా వుంటుంది. చాలామంది ఈ దోమలను పారదోలేందుకు ఏవో దోమల మందులు వాడుతుంటారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందువల్ల నీళ్ల ట్యాంకులపై ఎప్పుడూ మూతలు పెట్టి వుంచాలి. కూలర్లలో వుండే నీటిని కూడా తీసేయడం మంచిది. ఖాళీగా విరిగిపోయిన వస్తువులు వుంటే పారేయడం మంచిది. అలాగే ఇంట్లో నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి. నీరు నిలిచి వుండే చోట కాఫీ పొడి చల్లితే దోమలు పెరగవు.
 
వెల్లుల్లి దోమల్ని నివారిస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని బాగా దంచి రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరగించాలి. ఈ నీరు చల్లారాక ఇంట్లో అక్కడక్కడా చల్లితే దోమలు రాకుండా వుంటాయి.
 
వేప నూనె కూడా దోమల్ని నివారిస్తుంది. కొబ్బరి నూనె, వేప నూనెలను సమపాళ్లలో తీసుకుని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ఈ నూనెను నిద్రించే ముందు ఒంటికి రాసుకోవాలి. దీనితో దోమలు దరిచేరవు. లేదంటే తులసి నూనె రాసుకున్నా ఫలితం వుంటుంది. నిమ్మ నూనె, యుకలిప్టస్ నూనె సమపాళ్లలో కలిపి దోమలు ఎక్కువగా తిరిగే చోట చల్లాలి. ఇలా చేస్తే దోమల బెడద వదులుతుంది.