Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకూ డోనాల్డ్ ట్రంప్‌కు అఫైర్ ఉందా : నిక్కీహేలీ ఏమంటున్నారు?

శనివారం, 27 జనవరి 2018 (11:39 IST)

Widgets Magazine
nikki haley

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు, ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీకి అఫైర్‌ ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై హేలీ స్పందించారు. ట్రంప్‌తో అఫైర్‌ అని వ్యాఖ్యలు చేయడం చాలా అసహ్యంగా ఉందన్నారు. 
 
మైకేల్‌ ఊల్ఫ్‌ రాసిన ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’ పుస్తకంలో ట్రంప్‌తో నిక్కీకి అఫైర్‌ ఉందని రాయడంతో ఈ వదంతులు వ్యాపించాయి. ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్‌ విమానంలో, ఓవల్‌ కార్యాలయంలో నిక్కీ చాలా సేపు ఒంటరిగా గడిపారని ఊల్ఫ్‌ పుస్తకంలో రాశారు. ఇది పూర్తిగా అబద్ధమని, చాలా అసహ్యంగా, అసభ్యంగా రాశారని నిక్కీ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో తాను ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారని తెలిపారు. అలాగే ఓవల్‌ కార్యాలయంలో కూడా ట్రంప్‌తో తన రాజకీయ భవిష్యత్తు గురించే మాట్లాడానని, ఎప్పుడూ వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదని, అలాగే తాను ఎప్పుడూ అధ్యక్షుడితో ఒంటరిగా లేనని స్పష్టంచేశారు. 
 
ఎక్కువ శాతం మంది పురుషులు మహిళల్ని గౌరవిస్తున్నారు.. కొంతమందే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని హేలీ అన్నారు. బలమైన వ్యక్తిత్వమున్న మహిళలను హేళన చేయడం అంత సులువు కాదని పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇండియన్ టెక్కీలకు డోనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. ఏంటది?

భారతీయ టెక్కీలకు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఓ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ...

news

మైత్రి కోసం మోడీ వేసిన బాట తెలిస్తే.. షాకే...

దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావంతో జాతీయ పార్టీలు ఉనికిని కొనసాగించడం ...

news

'కలెక్టర్' ఓవరాక్షన్... ఆమ్రపాలి "నవ్వుల"పాలు (వీడియో)

ఆమె ఓ ఐఏఎస్ అధికారి. సాక్షాత్తు జిల్లా పరిపాలనాధికారి. గణతంత్ర వేడుకల్లో జెండా వందం చేశాక ...

news

మహరాష్ట్రలో ఘోరం... నదిలో బోల్తాపడిన బస్సు.. 13 మంది జలసమాధి

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఓ బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ...

Widgets Magazine