శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (12:52 IST)

గడ్డ‌క‌ట్టిన నీటి ప్రాంతంలో మొస‌ళ్ల కష్టాలు... వీడియో వైరల్

గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా, అతివృష్టి లేదా అనావృష్టి రీతిలో వాతావరణం ఉంది. ఇపుడు మంచు దుప్పటి కప్పేసింది. ఫలితంగా అనేక నదులు, పర్వత ప్రాంతాలు గడ్డ

గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా, అతివృష్టి లేదా అనావృష్టి రీతిలో వాతావరణం ఉంది. ఇపుడు  మంచు దుప్పటి కప్పేసింది. ఫలితంగా అనేక నదులు, పర్వత ప్రాంతాలు గడ్డకట్టుకుని పోతున్నాయి. ఈ పరిస్థితి అమెరికా, కెనడా దేశాల్లో మరింత దారుణంగా ఉంది.
 
ముఖ్యంగా అమెరికాలో న‌దులు, స‌ర‌స్సులు, కొల‌నులు అన్నీ గ‌డ్డక‌ట్టుకుపోవడంతో వాటిలో నివ‌సించే జంతువుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. చేప‌లు, క‌ప్ప‌ల ప‌రిస్థితి ప‌క్క‌న పెడితే ఉభ‌య‌చ‌రాలైన మొస‌ళ్ల ప‌రిస్థితి మరీ ఘోరంగా మారింది. గ‌డ్డ క‌ట్టే చ‌లి నుంచి అవి ఎలా ర‌క్ష‌ణ పొందుతాయో తెలిపే వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఇందులో గడ్డ‌క‌ట్టిన నీటి ప్రాంతంలో మొస‌ళ్ల ముక్కులు మాత్రం బ‌య‌టికి ఉండ‌టం చూడొచ్చు. ఈ వీడియోను మీరూ చూడండి.