శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (10:10 IST)

స్నేహ బంధానికి 'డోక్లాం' ఎసరు.. భారత్‌కు చైనా వార్నింగ్

భారత్, చైనా దేశాల మధ్య డోక్లాం వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగా ఉభయ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చైనా వెనక్కి తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

భారత్, చైనా దేశాల మధ్య డోక్లాం వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగా ఉభయ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చైనా వెనక్కి తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇపుడు మరోమారు చైనా ఈ అంశాన్ని లేవనెత్తుతూ, భారత్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీనిపై భారత్ కూడా ఒకింత ఘాటుగానే స్పందించింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు వద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. 
 
భారత్, పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో డోక్లాం ఉంది. ఈ ప్రాంతం మీదుగా పాకిస్థాన్ వరకు చైనా ఓ రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చైనా తాజాగా వార్నింగ్ ఇచ్చింది. 
 
ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక బంధాలను దెబ్బతీసేంతగా డోక్లాం మారిపోయిందని, భారత్ దుందుడుకు వైఖరే ఇందుకు కారణమని, ఆ ప్రాంతం చైనాదేనని చెప్పేందుకు ఎటువంటి సందేహాలూ లేవని వాదించింది. 
 
ప్రస్తుతం ఇండియాలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి రష్యా - ఇండియా - చైనా విదేశాంగ శాఖ స్థాయి సమావేశంలో పాల్గొన్న వేళ, సుష్మా స్వరాజ్ తో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంవత్సరం జూన్ నుంచి దాదాపు 73 రోజుల పాటు డోక్లాం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.