శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (14:04 IST)

డిస్కోలో ఎంజాయ్ చేసిన ట్రంప్ దంపతులు: చేతిలో చెయ్యేసి..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ల మధ్య విబేధాలున్నాయని.. అందుకే మెలానియా ట్రంప్‌కు దూరమైందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా.. ఫ్లోరిడా కాల

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ల మధ్య విబేధాలున్నాయని.. అందుకే మెలానియా ట్రంప్‌కు దూరమైందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా.. ఫ్లోరిడా కాల్పుల ఘటన బాధితులను పరామర్శించిన తర్వాత.. ఆస్పత్రి నుంచి ట్రంప్ దంపతులు డిస్కోకు వెళ్లారు. 
 
ఫ్లోరిడా ఘటనలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రిలో పరామర్శించిన ట్రంప్ దంపతులు.. నేరుగా డిస్కోలో నైట్ పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేశారు. రెస్టార్ట్‌లో జరిగిన ఈ పార్టీలో మెలానియా భర్తతో కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. ఈ పార్టీ సందర్భంగా ట్రంప్ చేతిలో మెలానియా చేయేసి సన్నిహితంగా కూర్చుని కనిపించారు. ఈ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.