శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (15:12 IST)

అవును పోర్న్‌స్టార్‌కి రూ.83 లక్షలు చెల్లించా: డొనాల్డ్ ట్రంప్ లాయర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ బాంబు పేల్చారు. ఒకప్పుడు తనకు ట్రంప్‌తో సంబంధం వుందని వార్తలొచ్చిన పోర్న్‌స్టార్‌కు రూ.83 లక్షల మొత్తాన్ని చెల్లించాననే మాట నిజమేనని మై

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ బాంబు పేల్చారు. ఒకప్పుడు తనకు ట్రంప్‌తో సంబంధం వుందని వార్తలొచ్చిన పోర్న్‌స్టార్‌కు రూ.83 లక్షల మొత్తాన్ని చెల్లించాననే మాట నిజమేనని మైకేల్ కోహెన్ వ్యాఖ్యానించారు. తాను చట్టబద్ధంగానే ఆ డబ్బు చెల్లించాను. ఎందుకు చెల్లించాననే విషయాలను మాత్రం వెల్లడించనని కోహెన్ తెలిపారు. 
 
ట్రంప్‌తో సంబంధం వున్న పోర్న్‌స్టార్ అసలు పేరు స్టెఫానీ క్లిఫోర్డ్ కాగా, తెరపై స్టార్మీ డేనియుల్స్ అని చలామణి అవుతున్నట్లు కోహెన్ క్లారిటీ ఇచ్చారు. క్లిఫోర్డ్‌తో లావాదేవీల విషయంలో ట్రంప్ సంస్థగానీ, ట్రంప్ గానీ భాగస్వామ్యులు కారని చెప్పారు. ఆ మొత్తాన్ని తనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవ్వరూ తిరిగి ఇవ్వలేదని తెలిపారు.
 
కాగా 2016 నవంబర్ ఎన్నికలకు ఒక నెల ముందు ఈ చెల్లింపు జరిగిందని, ట్రంప్‌తో సంబంధం కలిగివుండటంతోనే డబ్బుతో ఆమె నోరు మూయించారని అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. 
 
కానీ 2006 క్లిఫోర్డ్‌తో లైంగిక సంబంధాలుండే సమయానికి తాను ప్రైవేట్ వ్యక్తినేనని.. తాను రాజకీయాల్లోకి రాలేదని ట్రంప్ వాదిస్తున్నట్లు సమాచారం. అప్పటికే మెలానియాతో తనకు పెళ్లైందని చెప్తున్నా.. మీడియా మాత్రం క్లిఫోర్డ్‌తో ట్రంప్‌కు సంబంధాలున్నాయనే అనుమానాలతో కూడిన కథనాలను ప్రచురించాయి.