Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సూర్యుడికి వయసైపోతోంది.. ఆ శక్తిని కోల్పోతున్నాడట: నాసా

మంగళవారం, 23 జనవరి 2018 (18:13 IST)

Widgets Magazine

సూర్య భగవానుడు ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ శక్తి కోల్పోతున్నాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమిపై జీవులకు ఎలా వృద్ధాప్య ఛాయలు వస్తాయో.. సూర్యుడికి కూడా అలానే వచ్చాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 460కోట్ల ఏళ్ల క్రితం పుట్టిన సూర్యుడికి గ్రహాలు దూరంగా జరుగుతున్నాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
ఇందుకు బుధ గ్రహం కక్ష్యలో వచ్చిన మార్పులే నిదర్శనమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయాన్ని నాసా పంపిన ''మెసెంజర్'' అనే అంతరిక్ష నౌక వెల్లడించింది. ఈ నౌక మార్చి 2011 నుంచి ఏప్రిల్‌ 2015 మధ్య బుధగ్రహం చుట్టూ తిరుగుతూ పలు కీలక సందేశాలను భూమిపైకి పంపింది. ఐన్‌ స్టీన్‌ ప్రతిపాదించిన ''సాపేక్ష సిద్ధాంతాన్ని'' అన్వయిస్తూ మేసేంజర్‌ సందేశాలను పరిశీలించగా ఈ విషయం బహిర్గతం అయ్యింది.
 
ఇకపోతే.. సూర్యుని గురించిన కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు.. 
సూర్యుని ఉపరితల వాతావరణం - 5,500 సెంటీ గ్రేడ్స్ ఉష్ణోగ్రత
సూర్యుని వయస్సు - 460 కోట్ల సంవత్సరాలు.
సూర్యమండలం యొక్క వ్యాసం – 1,392,684 కిలోమీటర్లు
సూర్యుని వెలుగు భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు.
సూర్యుడు ఒక సెకన్‌కు 220 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాడు.
సూర్యునికీ భూమికీ మధ్య దూరం సుమారు 15కోట్ల కిలోమీటర్లుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
సూర్యుడు భగభగ మండడానికి కారణం తనలోనున్న హైడ్రోజన్ అనే వాయువని.. ఆ హైడ్రోజన్‌లో సగం ఇప్పటికే మండిపోయిందని.. అది పూర్తిగా మండిపోతే సూర్యుడు అంతర్ధానమైపోతాడని.. దీనిప్రకారం సూర్యునికి ప్రస్తుతం మధ్య వయస్సు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Nasa Spacecraft Sun Satellites Voyager Nicola Fox Hubble Space Telescope

Loading comments ...

తెలుగు వార్తలు

news

2019 ఎన్నికల్లో తెదేపా-145 వైసీపికి 35 స్థానాలే... అంత ధీమా ఎందుకో...

అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకున్నట్లు కనబడుతోంది. తెలంగాణ నుంచి పవన్ ...

news

ఈ నెయిల్ పాలిష్ ధర రూ.1,63,66,000- అందులో ఏముంది?

లగ్జరీ లైఫ్ విన్నాం.. లగ్జరీ నెయిల్ పాలిష్ కూడా వచ్చేసింది. గతంలో మోడల్స్ ఓన్ అనే సంస్థ ...

news

భార్యతో సఖ్యంగా లేను సునీతను త్వరలోనే పెళ్లి చేసుకుంటా : సీఐ మల్లికార్జున రెడ్డి

తమ మధ్య వివాహేతర సంబంధం లేదనీ కానీ మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని భావించామని ...

news

సీఐతో నా భార్య ఏఎస్పీ సునీతారెడ్డికి అక్రమ సంబంధం.. భర్త సురేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని సీఐ మల్లికార్జున రెడ్డికి, అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ...

Widgets Magazine