శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (07:46 IST)

భారత్‌లో 5జీ సేవలు.. జూన్ నుంచి చర్యలు.. 5జీ సిమ్‌లకు కొత్త నెంబర్లు..

ఉచిత డేటా.. 4 జీ సేవలతో రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ నుంచి భారత్‌లో 5జీ సేవలకు సంబంధించిన సేవలను ఖరారు చేసేందుకు టెలికాం రంగ సంస్థ సన్నాహాలు

ఉచిత డేటా.. 4 జీ సేవలతో రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ నుంచి భారత్‌లో 5జీ సేవలకు సంబంధించిన సేవలను ఖరారు చేసేందుకు టెలికాం రంగ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే 5జీ సేవలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే నాటికి భారత దేశంలో కూడా ఆ సేవలను అందిపుచ్చుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్లు కమిటీ వెల్లడించింది. 
 
ఈ ఏడాది లోపు 5జీ ప్రపంచ ప్రమాణాలు తుదిరూపు దిద్దుకుంటాయని తెలుస్తోంది. ఇంతలోనే భారత్‌లోనూ 5జీ సేవలను అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో 5జీ సిమ్‌లకు కొత్త నెంబర్లను రూపొందించడం కూడా జరుగుతోందని.. దీని కార్లలోని సెన్సర్ల ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు చేసినట్లు టెలికాం సంస్థ తెలిపింది. 
 
ఇకపోతే.. 4జీ కంటే  5జీ వేగవంతమైంది. 5జీలాంటి అధునాతన టెక్నాలజీని ప్రారంభించాలంటే.. కచ్చితంగా మంచి స్పెక్ట్రమ్ కావాలి. 5జీ స్టాండర్స్ తట్టుకునేలా ఆ క్యారియర్స్ వుండాలి. 4జీ ఎల్‌టీఈ బ్యాండ్స్ స్థానంలో 5జీ రేడియో టెక్నాలజీస్‌ను సెట్ చేయాల్సి వుంటుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.