బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

స్టేషన్‌లో ఖాకీలో మందుతాగి.. అమ్మాయిలతో డ్యాన్స్ వేశారు...

హోలీ సిటీగా పేరుగాంచిన పంజాబ్ రాష్ట్రంలో పోలీసులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పంజాబ్ రాష్ట్రంలో కనీసం కూడా మద్యం విక్రయించరాదు. అలాంటిది.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు ఏకంగా పోలీసు స

హోలీ సిటీగా పేరుగాంచిన పంజాబ్ రాష్ట్రంలో పోలీసులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పంజాబ్ రాష్ట్రంలో కనీసం కూడా మద్యం విక్రయించరాదు. అలాంటిది.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు ఏకంగా పోలీసు స్టేషన్‌‍లోనే ఏకంగా మద్యం సేవించి.. అమ్మాయిలతో డ్యాన్స్ వేశారు. ఇది పంజాబ్‌లోని రూప్‌నగర్‌ జిల్లా ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
పోలీసులు మందు తాగుతూ.. పాటలు పాడుతూ, అమ్మాయిలతో డ్యాన్స్‌లు వేస్తూ ఎంజాయ్‌ చేసిన దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ ప్రాంతంలో మద్యం నిషేధించారు. అటువంటి ప్రదేశంలో ఏడుగురు పోలీసులు స్వయంగా పోలీస్‌ స్టేషన్‌లో కూర్చొని దర్జాగా మందు తాగుతూ ఎంజాయ్‌ చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ చేపడుతున్నట్లు రూప్‌నగర్‌ ఎస్‌ఎస్‌పీ రాజ్‌ బచ్చన్‌ సింగ్‌ సాధూ వెల్లడించారు. ఆ ఏడుగురు సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.