Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గర్భిణీకి సీటివ్వమంటే.. తోటి ప్రయాణీకులే ఇలా చేశారు..?

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (09:40 IST)

Widgets Magazine
pregnant woman

బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకుల్లో మానవత్వం కనుమరుగైందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. పిల్లలతో బస్సెకినా, గర్భం దాల్చిన మహిళలు నిల్చున్నా ఏమాత్రం కనికరం లేకుండా తోటిమనుషులు ప్రవర్తిస్తున్నారు. గర్భిణీ మహిళలను నిల్చున్నా.. వారికి లేచి సీటిచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది.

ఇలాంటి ఘటనే కేరళలోని కన్నూరులో చోటుచేసుకుంది. పుణ్యానికి పోతే ఓ వ్యక్తికి పాపమే ఎదురైంది. బస్సెక్కిన గర్భిణికి సీటు ఇవ్వమని.. కూర్చున్న వారిని అడిగిన ప్రయాణీకుడిపై దాడి జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. రాజన్ (50) అనే వ్యక్తి తన భార్యతో కలిసి వారమ్ బస్టాప్‌లో కన్నూరు వెళ్లేందుకు బస్సెక్కాడు. అదే బస్సులో తాలుక బస్టాప్‌లో ఓ గర్భిణి బస్సెక్కింది. బస్సు రద్దీగా వుండటంతో ఆమె నిలబడేవుంది. దీన్ని గమనించిన రాజన్ తన ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలను పిలిచి గర్భిణికి సీటు ఇవ్వాలని కోరాడు. 
 
అయితే దీన్ని గమనించిన బస్సులోని మిగిలిన ప్రయాణీకులు గర్భిణీ సీటు కోసం వారిని ఎలా లేవమంటారని బస్సులో వాగ్వాదానికి దిగారు. గొడవ మరింత ముదరడంతో రాజన్ దంపతులు బస్సు నుంచి దిగిపోవాలనుకునే లోపే.. బస్సులోని మిగిలిన ప్రయాణీకులు అందరూ రాజన్‌పై దాడి చేసి బస్సు నుంచి కిందికి తోసేశారు. ఈ ఘటనలో గాయాల పాలైన రాజన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
బస్సు ప్రయాణీకులు గర్భిణీ మహిళ కన్నూరు కేరళ Man Seat Bus Kerala Pregnant Woman

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆధార్‌ను పుట్టించిందనే మేమే అంటే నవ్వు రాదా?: రేణుకా చౌదరి

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన ...

news

ట్రైనీ నర్సుకు మత్తు సూది వేసి రేప్ చేసిన వైద్యుడు

తల నొప్పిగా ఉంది .. టాబ్లెట్ రాసివ్వమని వైద్యుడి వద్దకు వెళ్లిన ఓ ట్రైనీ నర్సు ...

news

మిస్టర్ జైట్లీ... మీరూ.. మీ సర్కారు శాశ్వతం కాదు : సుజనా చౌదరి ఫైర్

భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకునే దిశగానే అధికార టీడీపీకి చెందిన ఎంపీలు అడుగులు ...

news

బీజేపీకి ఏపీ ప్రజలు సమాధి కడుతారు : సీఎం రమేష్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామంటూ నాలుగేళ్లపాటు ఊరించి ఊరించి చివరకు ఊసురుమనిపించిన ...

Widgets Magazine