400 ఏళ్ల తర్వాత శాప విముక్తి.. మైసూర్ రాజకుటుంబానికి వారసుడొచ్చాడు..

గురువారం, 7 డిశెంబరు 2017 (10:54 IST)

నాలుగు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజ వంశానికి శాప విముక్తి కలిగింది. మైసూరు యువరాజు యదువీర తండ్రి అయ్యారు. 400 ఏళ్ల క్రితం శ్రీరంగపట్నం మహారాజు శ్రీరంగాయన(తిరుమలరాజ) భార్య అలివేలమ్మ శాపం రాజవంశానికి తగిలిందని అంటారు. ఆ శాప విముక్తి అయ్యింది.. ఇందులో భాగంగా మైసూరు రాజకుటుంబంలో కొత్త వారసుడు కూడా ఉదయించాడు. 
 
శ్రీ యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్, త్రిషికా దేవి దంపతులకు పండంటి బాబు జన్మించాడు. రాజస్థాన్‌లోని దుంగాపూర్ రాజకుటుంబానికి చెందిన హర్షవర్థన్ సింగ్ కుమార్తె త్రిషికను యదువీర్ గత ఏడాది జూన్ 27న వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో త్రిషికా జన్మనిచ్చిన బాబు వడయార్ వంశంలో 28వ తరానికి చెందినవాడు. 
 
బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో త్రిషికా దేవి పండంటి బాబుకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, దివంగత మైసూరు రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్, ప్రమోదా దేవి దంపతులకు సంతానం కలుగకుంటే, యదువీర్ గోపాల్ రాజును 2015 ఫిబ్రవరిలో దత్తత తీసుకుని, ఆయనకు సంప్రదాయ కిరీటాన్ని అప్పగించిన సంగతి విదితమే. దీంతో 600 సంవత్సరాల వడయార్ చరిత్రలో యదువీర్ 27వ తరం రాజుగా నిలిచారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎవ్వరినీ మరిచిపోను... శేఖర్ కమ్ములను వదిలిపెట్టను : పవన్ కళ్యాణ్

మెగా హీరో వరుణ్ తేజ్‌కు బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ దర్శకుడిపై పవర్ స్టార్ ...

news

తిరుపతికి వస్తూ తిరిగిరాని లోకాలకు....

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ...

news

బెడ్‌పై "ఆ" భంగిమలో భార్య.. నిలదీన భర్తను చంపి సెప్టిక్ ట్యాంకులో...

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి తమ ఇంట్లోని పడకగదిలో ...

news

ఆ నేతల చర్మం ఏనుగు చర్మంలా తయారైంది : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు.. దాని మిత్రపక్షమైన బీజేపీలకు ...