మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే : సుప్రీంకోర్టు ధర్మాసనం

బుధవారం, 11 అక్టోబరు 2017 (14:34 IST)

couple

మైనర్ భార్యతో శృంగారం చేయడం అత్యాచారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 15 నుంచి 18 ఏళ్లు నిండని మైనర్, భార్య అయినా, ఆమెతో శృంగారం కఠిన శిక్షార్హమేనని, నేరానికి పాల్పడిన వ్యక్తికి సెక్షన్ 375 ప్రకారం మినహాయింపులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో జరుగుతున్న బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయంలో కేంద్రం తక్షణం స్పందించాలని కోరింది.
 
కాగా, జీవిత భాగస్వామి వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత, బలవంతంగా శృంగారానికి పాల్పడటాన్ని వైవాహిక అత్యాచారంగా ప్రకటించే అంశంలో మాత్రం అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. దేశంలో 2.3 కోట్ల బాల్య వివాహాలు ఉండగా, వాటిని రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
నిజానికి గతంలో బంధుమిత్రుల నడుమ వైభవంగా వివాహం జరిగిన తర్వాత, భార్య మైనర్ అయినప్పటికీ, వారి మధ్య శృంగారాన్ని పెద్ద నేరంగా పరిగణించలేమని, భారత వివాహ విలువ, దాంపత్య బంధాలున్న అడ్డుగోడలు శిక్షకు అడ్డంకులని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 
 
ఇదే పిటీషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్, 18 ఏళ్లు నిండని భార్యపై జరిపే శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించి శిక్షించే అంశంపై చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. దీనిపై మరింత చదవండి :  
Criminalises Romance Supreme Court Minor Wife

Loading comments ...

తెలుగు వార్తలు

news

హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టాం: ఉత్తరకొరియా హ్యాకర్లు

అమెరికా లక్ష్యం తమ దేశాధ్యక్షుడిని హతమార్చేందుకు.. దానికి దక్షిణ కొరియా పూర్తి సహకారం ...

news

జగన్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేసేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ...

news

హనీప్రీత్ సింగ్ చెప్పును కూడా వదల్లేదు.. ఫోటో తీసిన మీడియా.. సెల్ఫీల కోసం..

డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ...

news

గుండెలు పిండేసే ఘటన... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ కూడా....

భారత ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో తీవ్రవాదులతో నిత్యం పోరాడుతూ దేశాన్ని, దేశ ప్రజలను ...