Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరోయిన్ శ్రుతి అరెస్ట్.. అవకాశాల్లేకపోవడం వల్లే అలా చేసిందట.. ఏం చేసింది?

శనివారం, 13 జనవరి 2018 (16:18 IST)

Widgets Magazine
ShruthiP

చెన్నై నటి, ''ఆడి పోనా ఆవణి" హీరోయిన్ శ్రుతి అరెస్టయ్యింది. జర్మన్‌లో స్థిరపడిన ఎన్నారైని పెళ్లి చేసుకుంటానని రూ.41 లక్షలను మోసం చేసింది.  ఇదే తరహాలో ఫేస్‌బుక్ మాధ్యమంగా ధనవంతుల బిడ్డలను లక్ష్యంగా భారీ మొత్తాన్ని కాజేసిందని పోలీసుల విచారణలో తేలింది. వివాహం చేసుకుంటానని, ప్రేమిస్తున్నానని ధనవంతుల బిడ్డల్ని నమ్మించి.. ఆపై అమ్మకు బ్రెయిన్ ట్యూమర్ అంటూ చెప్తుంది. ఆమెను కాపాడాలని వెంటనే డబ్బు బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయమని చెప్తుంది. 
 
ఇలా 2017 మే నుంచి జనవరి 2018 వరకు భారీ మొత్తాన్ని మోసం చేసి సంపాదించింది. మే 2017లో బాలమురుగన్ అనే వ్యక్తి జర్మనీలో ఆటోమొబైల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనిని మోసగించి శ్రుతి రూ.41లక్షలు గుంజేసింది. శ్రుతి మోసం చేసిందని తెలుసుకున్న బాలమురుగన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమ్మగారి బండారం బయటపడింది. 
 
ఈ నేపథ్యంలో పోలీసులు శ్రుతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సినీ రంగంలో సరైన అవకాశాలు లభించక, రాణించలేకపోయిన కారణంగానే, ఫేస్‌బుక్ మాధ్యమంగా ధనవంతులైన యువకులను మోసం చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు శ్రుతి పోలీసుల విచారణలో తెలిపింది. తన తల్లి, సోదరుడి సహకారంతోనే ఈ పని చేశానని, విలాస వంతమైన జీవితానికి అలవాటు పడటంతో ఖర్చులు పెరిగాయని అంగీకరించింది. 
 
మొత్తం ఎనిమిది మందిని శ్రుతి మోసం చేసినట్టు తెలిపింది. కాగా, శ్రుతితో పాటు ఆమె తల్లి, సోదరుడిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు, మరింత మందిని ఈమె మోసం చేసి ఉండవచ్చన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. కోర్టు అనుమతితో ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చేతులు కట్టేసి పోరాడమంటే ఎలా?: పవన్‌కు ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్న

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా ...

news

ఇన్‌స్టాగ్రాంలో మహిళా కోచ్‌కు విద్యార్థి లైక్... లైంగికంగా లోబరుచుకున్న మహిళా కోచ్

ఈమధ్య కాలంలో కొంతమంది ఉపాధ్యాయులు-విద్యార్థులు గురుశిష్యుల సంబంధం కాకుండా లైంగిక సంబంధం ...

news

ఓఎన్జీసీ హెలికాప్టర్ గల్లంతు.. నలుగురి మృతదేహాల వెలికితీత

ముంబైలోని జుహు నుంచి టేకాఫ్ అయిన ఓఎన్జీసీకి చెందిన ఓ హెలికాప్టర్ గల్లంతైంది. ముంబై ...

news

చైనాతో ముప్పు పొంచి వుంది... వేగం పెంచాలి: భారత ఆర్మీ చీఫ్

చైనా సరిహద్దులపై కన్నేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ...

Widgets Magazine