ప్రముఖుల సేవలో తరించిన టిటిడి.. సామాన్య ప్రజలు గాలికి...

శుక్రవారం, 29 డిశెంబరు 2017 (21:47 IST)

వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తిరుమలకు తరలివస్తారు. అలాంటి తిరుమలలో భక్తులకు కనీస సౌకర్యాలను కల్పించాల్సిన టిటిడి చేతులెత్తేసింది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి 5 కిలోమీటర్లకు పైగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. 
<a class=Tirumala Rush" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-12/29/full/1514564556-3723.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Tirumala Rush" width="600" />
 
చలికి కూడా లెక్కచేయక భక్తులు రోడ్లపైనే పడిగాపులు కాచారు. నాలుగు మాడవీధుల్లో ఇసుకేస్తే రాలనంత భక్తజనం కనిపించారు. ఎప్పటిలా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశాం.. సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని టిటిడి ఉన్నతాధికారులు ప్రకటనలు చేశారు కానీ అది ఏ మాత్రం సాధ్యం కాలేదు. గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. 
 
మరోవైపు  వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావ్, టిడిపి నేతలు సిఎం రమేష్, తెలంగాణా మంత్రులు, సినీనటులు తదితర ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.దీనిపై మరింత చదవండి :  
Tirumala Pilgrims Darshan Ekadashi Rush

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

భక్తుల గిరిగా మారిపోయిన తిరుమల.. తాగునీరు కూడా కరువైంది..

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ...

news

వైకుంఠ ఏకాదశి... ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం మహా పుణ్యం...

ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా ...

news

దర్శనం కోసం తిరుమలకు వెళ్ళాల్సిన పనిలేదు.. బయటే కనిపిస్తున్నాడు దేవుడు..?

ఇదేంటి.. శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే 20 కిలోమీటర్లు వాహనంపై వెళ్ళాలి. లేకుంటే ...

news

రూ.168.84 కోట్ల ఆదాయంతో శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు

శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు సృష్టించారు. భక్తులు అందించే కానుకల విషయంలో పాత ...