Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బన్నీ వాసుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఏబీఎన్ ఆర్కే... చిరును తొక్కేస్తుందెవరు?

మంగళవారం, 21 నవంబరు 2017 (10:34 IST)

Widgets Magazine
Chiranjeevi

నంది అవార్డుల వ్యవహారంపై రోజూ ఏదోఒక చర్చ జరుగుతూనే వుంది. తాజాగా ఓపెన్ డిబేట్లో ఆర్కేలో మెగాస్టార్ తనవాడు అంటూ చెప్పుకుంటున్న బన్నీ వాసుకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. చర్చలో బన్నీ వాసు మాట్లాడుతూ... 2002 నుండి మా చిరంజీవి, మా మెగా ఫ్యామిలీకి అన్యాయం జరుగుతూనే వుంది. 
 
చిరంజీవి మావాడు, మా చిరంజీవి... అంటూ పదేపదే బన్నీ వాసు మాట్లాడటంపై ఆర్కే స్పందిస్తూ... పదేపదే మా చిరంజీవి అనవద్దు. అది చిరంజీవికే నష్టం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కమ్మవారి కడుపు నిండదు. అలాగే చిరంజీవి సీఎం అయితే కాపులకి కడుపు నిండదు అంటూ కౌంటర్ వేసారు. ఐతే దీనిపై మెగాస్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నప్పటికీ ఆర్కే చెప్పినదాంట్లో నిజం వుంది. 
 
ఎందుకంటే ఓ స్థాయికి చేరిన సెలబ్రిటీ అందరివాడుగా మారిపోతాడు. ఆయన ఏ కులానికో మతానికో పరిమితం కాబోడు. చిరంజీవిని కేవలం కాపు సామాజికవర్గం అంటూ ముద్ర వేయడం వల్లనే గత 2009 ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయాడనేది దీన్నిబట్టి తెలుస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సహనం కోల్పోయిన కర్ణాటక మంత్రి (వీడియో)

కర్ణాటక మంత్రి ఒకరు సహనం కోల్పోయారు. ఆయన పేరు డీకే శివకుమార్. మీడియాతో మినిస్టర్ ...

news

ఉగ్రవాద పోషక దేశంగా ఉత్తర కొరియాను ప్రకటిస్తున్నాం: ట్రంప్

ఉత్తర కొరియాను ఉగ్రవాదులను పోషిస్తున్న దేశంగా అమెరికా ప్రకటించింది. ప్రపంచం ...

news

నా పేరులోనే ''చిల్'' ఉంది.. శశి ట్వీట్‌కు మానుషి కౌంటర్

"మిస్ వరల్డ్ 2017".. మానుషి చిల్లార్. 17 యేళ్ల క్రితం సుస్మితా సేన్ ఈ కిరీటాన్ని ...

news

చెన్నై ఎయిర్ పోర్టులో వ్యక్తి హంగామా.. రన్ వేపైకి వచ్చి..?

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. రన్ వే వద్దకు దూసుకెళ్లి.. ...

Widgets Magazine