సమంత, నాగచైతన్యకు సరిగ్గా ఆ టైమ్‌కి రింగులు పంపిన పవన్, త్రివిక్రమ్...

గురువారం, 12 అక్టోబరు 2017 (10:36 IST)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రంలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత, నాగచైతన్య వివాహ సమయానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని డబ్ల్యూ హోటల్‌లో అక్టోబర్‌ 6న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో కొత్త దంపతులకు సమంత, నాగచైతన్యకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. సరిగ్గా వివాహ సమయానికి వారిద్దరికీ ఉంగరాలు అందేలా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఆ ఉంగరాలను చూసిన సమంత, చైతూ హ్యాపీగా ఫీలయ్యారట. ఈ ఉంగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది.
 
తొలుత ఈ ఉంగరాలను హైదరాబాదులో నిర్వహించనున్న రిసెప్షన్‌లో ఇవ్వాలనుకున్నారట. అయితే వివాహం సమయానికి ఇస్తేనే బాగుంటుందని భావించి.. ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చారని టాక్. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ వీడియోలో యూత్‌ను మత్తెక్కిస్తున్న టాలీవుడ్ రత్తాలు... (Video)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలీ'కి సీక్వెల్‌గా ...

news

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో హీరోయిన్‌గా లక్ష్మీపార్వతినే పెట్టుకోండి : వర్మకు సోమిరెడ్డి సలహా

వివాదాస్పద చర్యలు, ప్రకటనలతో నిత్యం మీడియా ప్రచారం కోసం వెంపర్లాడే దర్శకుడు రాంగోపాల్ ...

news

మెగాస్టార్ కెరీర్లోనే ఓ బిగ్గెస్ట్ హిట్ కావాలన్న పట్టుదలతో చెర్రీ...

తెలుగు సినీచరిత్రలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మొదటి స్థానం చిరంజీవిదనే చెప్పాలి. ...

news

సమంత రుత్ ప్రభు.. సమంత అక్కినేనిగా మారిపోయింది.. ట్విట్టర్లో సమంత

ఇన్నాళ్లు సమంత రుత్ ప్రభు అని వుండిన సమంత పేరు.. సమంత అక్కినేనిగా మారిపోయింది. కానీ ...