Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డియర్ ఇండియా.. స్వేచ్ఛకు అర్థం ఇదా? అనసూయ ప్రశ్న

శనివారం, 27 జనవరి 2018 (09:07 IST)

Widgets Magazine
Anchor Anasuya

బుల్లితెర యాంకర్ అనసూయ. ఓ యాంకర్‌గానే కాకుండా అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తూ, కుర్రకారును హుషారెత్తిస్తోంది. ముఖ్యంగా, ఈమె వస్త్రధారణపై పలువురు పలురకాలైన కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెకు ఏకంగా అసభ్యంగా మొబైల్ సందేశాలను కూడా పెడుతున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఆమె ఘాటైన ట్వీట్ చేసింది. ఓపక్క అభిమానులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెబుతూ.. మరోపక్క కొందరు తనను కించపరిచే మాటలతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. 
 
'డియర్ ఇండియా.. ఓ కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా.. మిగతా అందరిలా నా కుటుంబం కోసం నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను. నేను చేసే పని, ధరించే దుస్తులు నా కుటుంబాన్ని ఏ విధంగానూ ఇబ్బంది కల్గించడం లేదు. కానీ, ఇతరులు మాత్రం స్పందిస్తున్నారు.. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని కొందరు నన్నే కాదు, నా భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని దూషిస్తున్నారు, అమర్యాదగా, అగౌరవంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాకు వచ్చే ఫోన్ కాల్స్, కామెంట్స్‌తో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇది తెలుసుకునే శక్తి కూడా మీకు లేదు. బాధ్యత కలిగిన ఓ మహిళగా, రిపబ్లిక్ డే నాడు నేను ప్రశ్నిస్తున్నాను.. స్వేచ్ఛకు అర్థం ఇదా? నేను కోరుకున్న పనిని చేసుకునే స్వేచ్ఛ నాకు లేదా? సంస్కృతీసంప్రదాయాల పేరిట నా భావాలను, గౌరవాన్ని అణగదొక్కే స్వేచ్ఛ ఈ గూండాలకు ఉందా? ఇక, ఇలాగే జీవించాలా?? ఏమీ చేయలేమా??' అంటూ అనసూయ తన ఆవేదనను వెళ్లగక్కింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఓ హోమోసెక్సువల్!?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఓ యువకుడు సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా కూడా ...

news

#Bhaagamathie రివ్యూ రిపోర్ట్: హారర్‌తో ఆకట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్.. కత్తి పాజిటివ్ రిపోర్ట్

లేడి సూపర్ స్టార్ అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గణతంత్ర ...

news

పవన్ తొలిప్రేమ కంటే.. మాది హిట్ అవుతుంది: రాశీఖన్నా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి ...

news

జై కుమారే అసలు దొంగన్న వర్మ- ట్రాఫిక్ వల్లే జీఎస్టీ లింకు ఓపెన్ కాలేదు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ కథ తనదేనని.. తన వద్ద నుంచి దొంగలించి గాడ్ ...

Widgets Magazine