Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్యాక్‌ టు వర్క్ : 'సవ్యసాచి' షూటింగ్‌లో నాగచైతన్య

బుధవారం, 8 నవంబరు 2017 (14:27 IST)

Widgets Magazine
savyasachi movie still

ఇటీవల ఒక్కటైన టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంత. వీరిద్దరూ హనీమూన్ ముగించుకుని తిరిగి షూటింగ్‌లకు హాజరవుతున్నారు. సమంత ఇప్పటికే చెర్రీ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్ర యూనిట్‌తో కలిసిపోయింది. 
 
అలాగే, ఆమె భర్త, హీరో నాగచైతన్య కూడా షూటింగ్‌కు హాజరయ్యాడు. చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం ప్రారంభమైంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతుకు జోడిగా నిథి అగర్వాల్‌ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్నఈ సినిమాకు సీనియర్‌ సంగీత దర్శకుడు కీరవాణీ స్వరాలందిస్తున్నారు.
 
బుధవారం నుంచి షూటింగ్‌ ప్రారంభమైన విషయాన్ని కన్ఫమ్‌ చేస్తూ సవ్యసాచి సెట్‌లో యూనిట్‌తో కలిసి దిగిన ఫొటోను తన సోషల్‌మీడియా పేజ్‌‌లో పోస్ట్‌ చేసిన చైతూ ‘బ్యాక్ టు వర్క' అంటూ కామెంట్ చేశాడు. సవ్యసాచి సినిమా సెట్స్‌ మీద ఉండగానే మారుతి దర్శకత్వంలో మరో సినిమాను చైతు ప్రారంభించనున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మించనున్న ఈ సినిమాకు ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ ఫైనల్‌ చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా నగ్న ఫోటోలను పోస్టు చేస్తున్నారు.. అమ్మాలని చూస్తున్నారు.. జాగ్రత్త: సియా ఫర్లెర్

ఆస్ట్రేలియాకు చెందిన ''చీప్ థ్రిల్స్" సింగర్ సియా ఫర్లెర్ తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో ...

news

'మహానటి'లో ఏఎన్నార్ పాత్రలో విజయ్

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ సొంత బ్యానెర్ వైజయంతి మూవీస్‌‌పై అలనాటి అందాల నటి సావిత్రి ...

news

రాజశేఖర్ మనసున్న మనిషి.. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు: సునీల్

సినీ నటుడు, వైద్యుడు అయిన హీరో రాజశేఖర్ మనసున్న మనిషి అని కమెడియన్ కమ్ హీరో సునీల్ ...

news

బ్రాహ్మణకులంలో పుట్టి అందరివాడినయ్యా... హిందూ విరోధిగా చిత్రీకరిస్తున్నారు: కమల్

తాను బ్రాహ్మణకులంలో పుట్టినప్పటికీ దర్శకదిగ్గజం కె.బాలచందర్ వెండితెరకు పరిచయం చేశాక తాను ...

Widgets Magazine