టచ్ చేయకుండానే రూ.లక్షల్లో గుంజేసిన తమిళ నటి శ్రుతి

ఆదివారం, 14 జనవరి 2018 (10:04 IST)

ShruthiP

తెలుగులో ఓ సామెత ఉంది. తొడ చూపించకుండానే రూ.90 వేలు సంపాదించిందన్నది ఆ సామెత. కొందరు అమ్మాయిలు తన శరీర అందాలను ఎరగా చూపి యువకుల నుంచి లక్షలాది రూపాయులను గుంజుతుంటారు. ఈ కోవలో తమిళ నటి శ్రుతి చేరింది. ఈమె తమిళనాట తన అందంతో ధనవంతుల బిడ్డలకు సామాజిక మాధ్యమాల ద్వారా ఎరవేసి, వారి నుంచి లక్షల రూపాయలు గుంజేసింది. 
 
తమను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందని పలువురు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకురాని చాలా మంది, ఇప్పుడు పోలీసుల ముందుకు వస్తున్నారు. దీంతో శ్రుతి సెల్ ఫోన్‌లోని కాంటాక్టుల ఆధారంగా విచారణ ప్రారంభించిన అధికారులు, ఒక్కొక్కరి నుంచి ఆమె మోసాలకు సంబంధించిన వివరాలు లాగుతున్నారు. 
 
కోయంబత్తూరుకు చెందిన ఓ ఇంజనీర్ అమెరికాలో ఉండగా, అతనికి పెళ్లి ఆశ పెట్టి రూ.15 లక్షలకు పైగా డబ్బు గుంజిందని పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. ఆమె వల్ల మోసగింపబడిన వారి జాబితా చాలా పెద్దదని పోలీసు వర్గాలు అంటున్నాయి. కాగా, శృతిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెల్సిందే.దీనిపై మరింత చదవండి :  
Shruthi Cheats Youngsters Facebook Chennai Actress

Loading comments ...

తెలుగు సినిమా

news

గౌరవ న్యాయమూర్తుల్లారా సలాం.. ప్రకాష్ రాజ్

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు.. అపెక్స్ కోర్టు పని ...

news

ఆ రోజు పోలీసులు రాకపోతే అంతా అయిపోయేదే... నమిత ఫ్లాష్‌బ్యాక్

ఇటీవలే తిరుపతిలో తన స్నేహితుడిని పెళ్లాడిన నమిత తాజాగా మీడియాతో మాట్లాడారు. తనంటే ...

news

అవి నన్నే వెతుక్కుంటూ వస్తాయంటున్న మెహరీన్

మహానుభావుడు, రాజా దిగ్రేట్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోయింది మెహరీన్. ఇక మెహరీన్‌కు ...

news

నాలుగే పదాలతో బండ్ల గణేష్ ట్వీట్- పవన్‌తో సినిమా చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ...