Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శింబు పాడిన పెద్దనోట్ల పాట వైరల్.. బీజేపీ భయంతో.. పటిష్ట భద్రత (వీడియో)

సోమవారం, 13 నవంబరు 2017 (18:02 IST)

Widgets Magazine

గతంలో శింబు పాడిన బీప్ సాంగ్ పెను వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరో శింబు పెద్దనోట్ల రద్దుపై పాట పాడారు. ఈ పాట సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో శింబుకు బెదిరింపులు వచ్చాయని తమిళనాట ప్రచారం సాగింది. అయితే పాటను వ్యతిరేకిస్తూ.. బెదిరింపులకు పాల్పడేవారిని చూసి తాను జడుసుకునే ప్రసక్తే లేదని శింబు వివరణ ఇచ్చాడు. 
 
ఇప్పటికే 'మెర్సల్' సినిమాలోని డైలాగులతో బీజేపీ నేతలు, సినీ పరిశ్రమ మధ్య మాటల తూటాలు పేలిన నేపథ్యంలో శింబు పాట కూడా వివాదం రేపింది. ఈ పాటను ప్రముఖ రచయిత వైరముత్తు కొడుకు కపిలన్‌ రాయగా, శింబు పాడారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో శింబుకు బెదిరింపులు వచ్చాయని తమిళనాట ప్రచారం సాగింది. 
 
ఈ క్రమంలో శింబు సోషల్ మీడియా మాధ్యమంగా స్పందించారు. తన పాట ప్రజలను ఆకట్టుకుంటోందని తెలిపారు. తనకు ఎవరి నుంచీ బెదిరింపులు రాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తనను బెదిరించే ప్రయత్నం చేసినా, తాను బెదిరిపోయే మనిషిని కాదని ఆయన తెలిపారు. తన పాట ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే కనుక క్షమించాలన్నారు.  
 
కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దును నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 8న తట్టురోమ్ తూక్కురోమ్ పేరుతో ఈ పాట విడుదలై తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇందులో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. దీంతో శింబుపై  బీజేపీ తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పాటను బ్యాన్ చేయాలని పట్టుబడుతోంది. కానీ ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే 9,554 మంది వీక్షించారు. అయితే శింబు ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేసే అవకాశం ఉండటంతో పోలీసులు హీరో ఇంటికి గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ముందు పొట్ట.. వెనుక బట్ట.. జబర్దస్త్ ఆదిపై మహేష్ కత్తి ఫైర్.. (వీడియో)

బిగ్‌బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయిన మూవీ క్రిటిక్ మహేష్ కత్తి ఆ షో నుండి ఎలిమినేట్ అయిన ...

news

కీర్తి సురేష్‌ బాగానే బుట్టలో వేసుకుంటోంది! (వీడియో)

వెండితెరపై సందడి చేస్తున్న మలయాళీ భామల్లో కీర్తి సురేష్ ఒకరు. ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా, ...

news

పవన్‌కు రూ.40కోట్ల ఆఫర్.. రజనీని బీట్ చేస్తారా? మరి ఎన్నికల సంగతి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో రావాలా? లేకుంటే సినిమాల్లో ...

news

రూ.80 కోట్ల బడ్జెట్‌తో సినిమా.. పవన్‌కు రూ.40 కోట్ల ఆఫర్?

తెలుగు చిత్రపరిశ్రమలోని నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీస్ మరో భారీ బడ్జెట్ చిత్రానికి ...

Widgets Magazine