Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీ ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు.. పిచ్చి వేషాలు వేయొద్దు : మెహ్రీన్ వార్నింగ్

ఆదివారం, 11 మార్చి 2018 (16:48 IST)

Widgets Magazine
mehreen

తన అభిమానులకు హీరోయిన్ మెహ్రీన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూనే సుతిమెత్తగా హెచ్చరించింది. రీసెంట్‌గా ఓ యువ‌కుడు మెహ్రీన్‌పై ఉన్న అభిమానంతో త‌న మెడ‌పై మెహ‌రీన్ పేరుని ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు. 
 
ఇది చూసిన మెహ‌రీన్ త‌న అభిమానుల‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. మీ ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు, కానీ ఇలా మిమ్మల్ని మీరు బాధించుకోకండి. మీ అందర్నీ ఎంతో అభిమానిస్తున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు మెహ్రీన్. 
 
కాగా, హీరో నాని న‌టించిన 'కృష్ణ గాడి వీరప్రేమ గాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఇప్పుడు ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంది. ఈ మధ్య 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. 
 
తాజాగా హీరో గోపిచంద్ సరసన 'పంతం' అనే సినిమా చేస్తుంది. ఇదేకాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతున్న 'నోటా' చిత్రంలోనూ న‌టిస్తుంది. వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)మూవీలో వరుణ్ తేజ్ పక్కన జోడిగా మెహ్రీన్‌ను తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఇలా వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న ఈ అమ్మడుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగింది. అదేసమయంలో అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేసే పిచ్చి వేషాలను కూడా నిశితంగా గమనిస్తూ ఇలా వార్నింగ్ ఇస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'కరణ్‌ జీత్' పేరుతో సన్నీ లియోన్ వెబ్ సిరీస్

ఇండో అమెరికన్ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ...

news

'చందమామ' హీరోయిన్‌పై చీటింగ్ కేసు

'చంద్రమామ' చిత్ర హీరోయిన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. బెంగళూరులోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ ...

news

బెంగాలీ బుల్లితెర సీరియల్ నటి సూసైడ్

బెంగాలీ టీవీ సీరియల్ నటి మౌమిత సాహా ఆత్మహత్యకు పాల్పడింది. తన నివాసంలో ఉరివేసుకుంది. ఆమె ...

news

మొహమాటంతో నష్టం జరిగింది... : రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమెకు ఇటీవలి ...

Widgets Magazine