Widgets Magazine

ఆ హీరోయిన్లు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేష్ ఎంతో తెలుసా?

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:38 IST)

pooja hegde

సాధారణంగా సినీ హీరో లేదా హీరోయిన్‌కు అయినా సరే ఒకే ఒక్క హిట్ పడితే చాలు.. వారు తమ రెన్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తుంటారు. ఈ విషయంలో హీరోయిన్లు ఒక అడుగు ముందుంటారు. ముఖ్యంగా, ఉత్తరాది భామల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
ఇలాంటివారిలో పూజా హెగ్డే ఒకరు. ఈమె రూటే సెపరేటు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఈ అమ్మడు మూడు సినిమాలు చేసింది. ఈ మూడు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా పూజా కోసం దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో, తన నాలుగో సినిమాకు పూజా ఏకంగా రూ.1.5 కోట్లు డిమాండ్ చేసిందట. వారు కూడా ఇంత మొత్తం ఇవ్వడానికి ఓకే చెప్పేశారు. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సాక్ష్యం' మూవీలో పూజా నటిస్తోంది. 
 
ఇకపోతే, మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ రూ.85 లక్షలు, ఫిదా భామ సాయి పల్లవి రూ.85 లక్షలు, నివేదా థామస్ రూ.70 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ రూ.60 లక్షలు, అనూ ఇమ్మాన్యుయేల్ రూ.50 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారట. 
 
అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటిస్తున్న కైరా అద్వానీ తన రెండో సినిమాను మెగా ఫ్యామిలీ హీరో రాంచరణ్‌తో చేయనుందట. ఈ సినిమా కోసం ఆమె రూ.70 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సైతం దర్శకనిర్మాతలు సై అంటుండటం గమనార్హం. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
హీరోయిన్లు టాలీవుడ్ పూజా హెగ్డే కీర్తి సురేష్ నివేదా థామస్ Tollywood Heroines Remuneration

Loading comments ...

తెలుగు సినిమా

news

'ప్యాడ్ మ్యాన్' చూసేందుకు ఛీ అంటున్న పాక్ సెన్సార్ బోర్డు సభ్యులు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్ర "ప్యాడ్ మ్యాన్". మహిళల రుతుక్రమంపై ...

news

అతడు నాతో వ్యాపారం చేయాలనుకున్నాడు.. థ్యాంక్స్ విశాల్: అమలా పాల్‌

ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలా పాల్ పందెంకోడి విశాల్‌కు ధన్యవాదాలు తెలిపింది. తనపై లైంగిక ...

news

తెదేపా ఎంపీలు జోకర్ల కంటే తక్కువ.. : రాంగోపాల్ వర్మ

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలపై టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు ...

news

నన్ను ఇంట్లో అందరూ ఎదవ అని పిలుస్తారు : వరుణ్ తేజ్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం "తొలిప్రేమ". ఈ చిత్రం ఈనెల పదో తేదీన ...

Widgets Magazine