హైపర్ ఆదికి అలా జబర్దస్త్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది

మంగళవారం, 2 జనవరి 2018 (15:00 IST)

Hyper Aadi

''జబర్దస్త్'' కార్యక్రమంలో పాల్గొనే నటులకు సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు యాంకరింగ్ చేయడం ద్వారా సినీ ఛాన్సులను అనసూయ, రష్మీ కైవసం చేసుకుంటున్నారు. ఇక జబర్దస్త్ నటులు కూడా సినిమాల్లో హాస్యనటులుగా, విలన్‌గా మంచి పేరు కొట్టేస్తున్నారు. తాజాగా హైపర్ ఆది.. తనకు జబర్దస్త్‌లో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు.
 
కాలేజీ రోజుల నుంచే స్టేజ్ షోలు చేసే వాడినని తెలిపాడు. ఒకే చోటున కూర్చుని పనిచేయడం తనకు ఇష్టం వుండదు. ఒకసారి ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ చేసి ఫేస్ బుక్‌లో పెడితే 'అదిరే అభి' కామెంట్ చేశాడు. అబి పిలుపు మేరకే తనకు జబర్దస్త్ అవకాశం వచ్చిందన్నాడు.
 
అంతేగాకుండా తాను బీటెక్ చదువుతున్నప్పటి నుంచి జబర్దస్త్ చూసేవాడినని.. స్టేజ్ షోపై పంచ్‌లేస్తే ప్రేక్షకులు తెగ నవ్వుకునేవారు. అందుకే స్టేజ్‌పై అడుగుపెట్టే అవకాశం తనకు వచ్చాక, డ్రామా ఎక్కువగా చేయకుండా, ప్రేక్షకులు ఎదురుచూసే పంచ్‌లతోనే మొత్తం ఎపిసోడ్ నడిపించాలని నిర్ణయించుకున్నాను. అందుకే జబర్దస్త్‌లో పంచ్‌లు పేలుతుంటాయని హైపర్ ఆది తెలిపాడు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవితో అలా తప్ప ఇంకెలాగైనా నటిస్తానంటున్న కీర్తి సురేష్

కీర్తి సురేష్. అటు తెలుగు, ఇటు తమిళ భాష సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయిన హీరోయిన్. ...

news

'జోకర్' పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానంటున్న 'కత్తి'

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై టాలీవుడ్ చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి ...

news

మలయాళ సూపర్ స్టార్ హీరోగా మహానేత "వైఎస్ఆర్ బయోపిక్"

చిత్రసీమలో బయోపిక్‌ల కాలంనడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు బయోపిక్‌ల ఆధారంగా ...

news

వెబ్ సిరీస్ పేరుతో నగ్నంగా సినిమా తీశారు : సినీ నటి ఫిర్యాదు

వెబ్‌ సిరీస్ పేరుతో నగ్నం(బ్లూ ఫిల్మ్)గా తీశారంటూ ఓ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ...