మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (12:39 IST)

కంగనా రనౌత్‌తో కరణ్ జోహార్.. కొత్త వివాదం తప్పదా?

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే దర్శకులు, నిర్మాతలు కాస్త జడుసుకుంటారు. పురుషాధిక్యంపై ఏకిపారేసే కంగనా రనౌత్.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌పై అప్పుడప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది. తాజాగా కంగ‌నా

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే దర్శకులు, నిర్మాతలు కాస్త జడుసుకుంటారు. పురుషాధిక్యంపై ఏకిపారేసే కంగనా రనౌత్.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌పై అప్పుడప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది. తాజాగా కంగ‌నా ర‌నౌత్‌, క‌ర‌ణ్ జోహార్.. విరుష్క ముంబై రిసెప్ష‌న్‌లో క‌లిసిన‌పుడు ఒక‌రినొక‌రు చూసి చిరున‌వ్వులు చిందించుకున్నారు.

ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ స‌హ‌జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న "ఇండియాస్ నెక్స్ట్ సూప‌ర్‌స్టార్స్" కార్య‌క్ర‌మానికి కంగనాను పిలుస్తారా? అనే ప్రశ్నకు ఇటీవ కరణ్ సానుకూలంగా స్పందించారు.
 
గ‌తంలో 'కాఫీ విత్ క‌ర‌ణ్‌' కార్య‌క్ర‌మంలో బాలీవుడ్‌లో స్వాభిమానాన్ని పెంచిపోషించే వ్య‌క్తిగా క‌ర‌ణ్‌ని అభివ‌ర్ణిస్తూ కంగనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆ త‌ర్వాత నుంచి వీలు చిక్కినప్పుడ‌ల్లా వివిధ కార్య‌క్ర‌మాల్లో కంగ‌నాను క‌ర‌ణ్ త‌న‌దైన రీతిలో కామెంట్లు చేసేవాడు. ఇలా వారిద్ద‌రి మ‌ధ్య వివాదం న‌డిచింది. ఈ నేపథ్యంలో కరణ్‌‌తో కంగనా మీటింగ్ ఎలాంటి వివాదాలకు దారితీస్తుందోనని బిటౌన్ జనం జడుసుకుంటున్నారు.