అమ్మ బయోపిక్ ''శశిలలిత"గా తీస్తా: కేతిరెడ్డి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, దివంగత జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళపై ''శశిలలిత'' పేరుతో సినిమా తీస్తానని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాహుబలిలా రెండు పార్టులుగా తీస్తానని చెప్పారు. మొ
తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలు చాటిన నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఇప్పటికే బాలకృష్ణ హీరోగా, దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో రెండు చిత్రాలు తెరకెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. మూడోదిగా ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టిపెట్టారు. అయితే ఈ సినిమా తీస్తే చంపేస్తానని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి బెదిరిస్తున్నట్లు కేతిరెడ్డి ఇటీవల విమర్శలు గుప్పించారు. తాజాగా కేతిరెడ్డి మరో బయోపిక్ తీసే పనులో పడ్డారని తెలిసింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, దివంగత జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళపై ''శశిలలిత'' పేరుతో సినిమా తీస్తానని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాహుబలిలా రెండు పార్టులుగా తీస్తానని చెప్పారు. మొదటి భాగంలో జయలలిత, శశికళ పాత్రల గురించిన కథను చూపిస్తానని.. రెండో భాగంలో ఆస్పత్రిలో చేరిన జయలలిత కథను చూపిస్తానని తెలిపారు. ఇంకేముంది..? ఇప్పటికే లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాపై వివాదం నెలకొన్న తరుణంలో మరోవైపు అమ్మ జీవిత చరిత్రపై సినిమా తీస్తానని కేతిరెడ్డి ప్రకటించి వివాదానికి తెరలేపారు.