శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (12:27 IST)

లక్ష్మీపార్వతీ బండారం ఏంటో తెలుగు ప్రజలకు తెలిసిపోద్ది: కేతిరెడ్డి

లక్ష్మీస్ వీరగ్రంథం చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీపార్వతి బండారమంతా తనకు బాగా తెలుసునని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి మాట్లాడుతూ..

లక్ష్మీస్ వీరగ్రంథం చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీపార్వతి బండారమంతా తనకు బాగా తెలుసునని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి మాట్లాడుతూ.. మద్రాసు నుంచి తమిళులు, తెలుగు వాళ్లు తనను తరిమేశారని.. మీడియా ముందు లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై కేతిరెడ్డి మండిపడ్డారు. 
 
''లక్ష్మీపార్వతి.. నీ పుట్టిన ఊరుకు, మెట్టిన ఊరుకు వస్తా''నంటూ సవాల్ విసిరారు. లక్ష్మీపార్వతీ వ్యవహారం ఏంటో తనకు తెలుసునని.. ఆమె బెదిరింపులకు బెదిరిపోయేవాళ్లం కాదని కేతిరెడ్డి అన్నారు. తాము ఉద్యమాల నుంచి వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకోవాలన్నారు. తనను తరిమేసే దమ్మూ ధైర్యం ఎవరికి వున్నాయని ప్రశ్నించారు. తనను తమిళనాడు నుంచి తరిమేశారని అంటారా? ప్రస్తుతం తాను తమిళనాడులోనే వున్నానని.. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం వచ్చానని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు.
 
తన సినిమా ద్వారా లక్ష్మీపార్వతి అసలు క్యారెక్టర్ ఏంటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందని.. కేతిరెడ్డి అన్నారు. గత నెల 12న ఈ చిత్రాన్ని హైదరాబాద్‌‍లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రారంభించిన విషయాన్ని, ఆ తర్వాత ఆ ఘాట్ అపవిత్రమైపోయిందంటూ దానిని పాలతో లక్ష్మీపార్వతి శుద్ధిచేసిన విషయంపై కేతిరెడ్డి ప్రస్తావిస్తూ.. లక్ష్మీపార్వతి ఓ బజారు వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారన్నారు. 
 
తనను బజారోడని, రౌడీ అని, వెధవ అని, అంతుచూస్తానని లక్ష్మీపార్వతి హెచ్చరించిందని కేతిరెడ్డి మండిపడ్డారు. తాను తీసే సినిమాను అడ్డుకుంటానని లక్ష్మీపార్వతి అంటున్నారని, ఆమె ఏ రకంగా అడ్డుకుంటుంది? అని ప్రశ్నించారు. ఆమె జీవితచరిత్రను రాసి, దానిని ఎక్కడైనా రిజిస్టర్ చేశారా? అని ప్రశ్నించారు.
 
లక్ష్మీపార్వతి గారూ.. నేను సినిమా తీస్తుంటే నువ్వు ఎందుకు ఉలిక్కిపడటం? అంటూ కేతిరెడ్డి అడిగారు. తనకో మనస్సుందని.. ఆ మనస్సుకు దమ్ముందని చెప్పుకొచ్చారు. అన్నగారి సతీమణిగా మీపై గౌరవం వుంది. ఆ గౌరవాన్ని కాపాడుకోండని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.