పవన్ కోసం రాసిన కథ ఇదే.. ఛాన్సిస్తే సినిమా తీస్తా : మహేష్ సోదరి

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (10:36 IST)

manjula

తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు మంజుల అనే సోదరి ఉన్నారు. ఈమె తాజాగా ఓ రాశారు. అదీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి రాశారు. ఈ కథను పవన్ కళ్యాణ్ వింటే ఖచ్చితంగా ఓకే చెపుతారని చెప్పుకొచ్చింది. 
 
తాజాగా ఆమె 'మనసుకు నచ్చింది' అనే చిత్రం తీయగా, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగాసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె తాను రాసిన స్టోరీ లైన్‌ను బహిర్గతం చేశారు. ప్రస్తుతం తాను సినిమా రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఓ హీరో, ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడన్న విషయంపై కథ రాసుకున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
తన కథ పవన్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని, తనకు అవకాశం లభిస్తే ఆయనతో సినిమా తీస్తానని వెల్లడించింది. తాను హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాయనని, కథ రాశాక ఎవరు సరిపోతారా? అని ఆలోచిస్తానని పేర్కొంది. మహేష్ బాబు ఇమేజ్‌కి తగిన కథ తయారు చేయడం తన కలని చెప్పుకొచ్చింది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విందు పార్టీలో మందుకొట్టి చిందేసిన నటీమణులు (వీడియో)

టాలీవుడ్‌లో వెండితెర అరంగేంట్రం చేసి ఆపై కోలీవుడ్‌ను ఓ ఊపువూపిన హీరోయిన్ ఖుష్బూ. ...

news

'సత్య గ్యాంగ్‌' సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తారట...

సమాజంలో అనాధలనేవారు లేకుండా చేయాలనే సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందిన చిత్రం 'సత్య ...

news

'తొలిప్రేమ'కు 100 మార్కులు వేసిన దర్శకధీరుడు

దర్శకుడు రాజమౌళి తీసే సినిమాలనే చాలా మంది మెచ్చుకుంటుంటారు. బాలీవుడ్ తరహాలో సినిమాలను ...

news

అప్పుడే పెళ్ళా... ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది..

తన బాయ్ ఫ్రెండ్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పెళ్ళి దాకా తెచ్చుకుంది శృతి హాసన్. పెళ్ళి ...