Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నందుల రచ్చ... పెరుగుతున్న నిరసన జ్వాలలు

ఆదివారం, 19 నవంబరు 2017 (10:34 IST)

Widgets Magazine
nandi awards

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నంది అవార్డులపై రగడ నడుస్తూనే ఉంది. తమ చిత్రానికి నంది పురస్కారం దక్కకపోవడంతో "రుద్రమదేవి" చిత్ర నిర్మాత, దర్శకుడు గుణశేఖర్‌ జ్యూరీపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, జ్యూరీ సభ్యులు కూడా సోషల్‌ మీడియాలో తమను విమర్శించే వారిపై ఎదురుదాడికి దిగారు. ఫలితంగా నందుల వివాదం మరింతగా ముదురుతోంది. 
 
ఈనెల 14వ తేదీన ఏపీ సర్కారు 2014, 15, 16 సంవత్సరాలకుగాను ఒకేసారి నంది పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలపై మొదటి నుంచి తీవ్ర దుమారం చెలరేగింది. అది ఇంకా నడుస్తూనే ఉంది. చిత్రపరిశ్రమకు చెందిన కొంతమంది తమ చిత్రాలకు నంది పురస్కారాలు దక్కకపోవడంతో జ్యూరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
నంది అవార్డులపై దర్శకుడు గుణశేఖర్‌ మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు. శనివారం మరోసారి నంది పురస్కారాలపై స్పందించారు. నంది అవార్డుల వెనుక రాజకీయం ఉందని ఆరోపిస్తూ, తన వెనుక మాత్రం ఏ శక్తీ లేదని స్పష్టం చేశారు. మహిళా సాధికారతపై తాను తీసిన రుద్రమదేవి చిత్రానికి అవార్డు దక్కకపోవడం బాధాకరమన్నారు. 
 
నటి జీవిత కామెంట్స్‌పైనా గుణశేఖర్‌ స్పందించారు. జీవిత అంటే తనకు చాలా గౌరవం ఉండేదని... అవార్డుల ప్రకటన విడుదల చేసిన తర్వాత ఆమె చంద్రబాబు, టీడీపీ గురించి మాట్లాడారన్నారు. చంద్రబాబు అవకాశమిస్తే టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారని... ఆ ఒక్కమాటతో ఆమెపైనున్న గౌరవం, నమ్మకం పోయిందన్నారు. 
 
ఇకపోతే, నంది అవార్డులపై వస్తున్న విమర్శలపై హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. 'లెజెండ్' అనేది మామూలు టైటిల్‌ కాదని.. అది పెట్టినప్పుడే కాంట్రవర్సీలు వచ్చాయన్నారు. అయినా తమ 'లెజెండ్‌' చిత్రం మాటలతో కాదు... చేతలతో చూపించిందంటూ చెప్పుకొచ్చారు. తాను నటించిన 'లెజెండ్‌'కు 9నంది అవార్డులు దక్కడం చాలా గర్వంగా ఉందన్నారు. అందరి సమష్టికృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పి, తమ సర్కారు అనుసరించిన తీరు కరక్టేనని బాలయ్య చెప్పకనే చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సారీ అమ్మా, చేసింది తప్పే ఫిదా భామ ఏంచేసింది? 'కణం' ట్రైలర్

యంగ్ హీరో నాగ శౌర్య సరసన ఓ ద్విభాషా మూవీలో సాయి పల్లవి నటిస్తోంది. "కణం" పేరిట ...

news

నయనను బంగారం.. అని పిలిచిన విఘ్నేష్.. ఇక పెళ్లే తరువాయి..

గోపి నయినార్ దర్శకత్వంలో అగ్ర హీరోయిన్ నయనతార నటించిన అరమ్ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ...

news

త్రిషను తిట్టిపోసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఎందుకంటే?

త్రిష సీనియర్ నటిగా మారిపోయింది. అయినా ఛాన్సులు అమ్మడుకు వెతుక్కుంటూనే వస్తున్నాయి. ...

news

ఆ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రేణూ దేశాయ్ ఫీలైపోతోందట...

ఇంటర్వ్యూలివ్వడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికప్పుడు తెలివిగా సమాధానాలు చెప్పాలి. ...

Widgets Magazine