శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (21:18 IST)

నంది అవార్డుల వివాదం... మద్దినేని ఘాటు వ్యాఖ్యలను పోస్ట్ చేశారు వర్మ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను రాయలేని బూతులు తిడుతూ టాలీవుడ్ అసిస్టెంట్ దర్శకుడు మద్దినేని రమేష్ బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను రాయలేని బూతులు తిడుతూ టాలీవుడ్ అసిస్టెంట్ దర్శకుడు మద్దినేని రమేష్ బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూ, రాంగోపాల్ వర్మపై మండిపడ్డాడు.
 
రాంగోపాల్ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ, కుటుంబ సభ్యులతో చీకొట్టించుకున్నాడని, అయినా బుద్ధి తెచ్చుకోలేదని విమర్శించాడు. సెక్యూరిటీ లేకుండా బయట తిరగలేని బతుకు బతుకుతున్నాడని నిప్పులు చెరిగాడు. ఆయన పోస్టును యథాతథంగా రాంగోపాల్ వర్మ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి కమిటీలో ఎలా నియమించారంటూ ప్రశ్నిస్తూ దీనికి ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.