నారా లోకేష్‌ ఆ టైపే అనుకుంటా - తమ్మారెడ్డి మండిపాటు

బుధవారం, 22 నవంబరు 2017 (16:48 IST)

Tammareddy

నంది అవార్డుల వ్యవహారం కాస్త మెల్లమెల్లగా సద్దుమణుగుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని మొదట్లో నిర్మాత బన్నీ వాసు నంది అవార్డుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురాగా ఆ తరువాత గుణశేఖర్, రాంగోపాల్ వర్మతో పాటు మరికొంతమంది దర్శకులు తీవ్రస్థాయిలో స్పందించారు. అవార్డుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు నాయుడు సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసి చివరకు అది కాస్త సద్దుమణుగుతున్న సమయంలో లోకేష్‌ దిమ్మతిరిగే వ్యాఖ్యలు చేశారు.
 
నంది అవార్డుల వ్యవహారంపై ఆంధ్రలో ఆధార్ కార్డులు లేనివారు అడుగుతున్నారంటూ లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. స్థానికత, సామాజిక వర్గం లాంటి వాటిని ప్రోత్సహించే మాటలే అందులో స్పష్టంగా కనిపించాయి. దీనిపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి నారా లోకేష్‌పై ధ్వజమెత్తారు. 
 
మంత్రి పదవిలో ఉన్న లోకేష్‌ బాధ్యతాయుతంగా మాట్లాడాలే తప్ప తెలిసీ తెలియని స్టేట్మెంట్ ఇవ్వడం బాధాకరన్నారు. మీ పరువు కాదు పోయేది మీ నాన్నగారి పరువు పోతుందని ఆలోచించడంటూ సలహా ఇచ్చారు.  మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే రాష్ట్రం పరువు పోతుందన్న భావన కలుగుతోందన్నారు తమ్మారెడ్డి. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవమనీ, ఐతే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన గౌరవానికి భంగం కలిగించేవిగా వున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై మరింత చదవండి :  
Comments Tammareddy Bharadwaja Nara Lokesh Nandi Awards Issue

Loading comments ...

తెలుగు సినిమా

news

సాక్ష్యాలను తారుమారు చేస్తున్న దిలీప్.. పాస్ పోర్ట్ ఇచ్చేయాలట..

ప్రముఖ సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా 85 రోజుల పాటు జైలులో ...

news

విజయ్ దేవరకొండతో "అర్జున్ రెడ్డి" హీరోయిన్‌లా చేస్తా : మెహ్రీన్

టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్లలో జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతున్న భామ మెహ్రీన్. ...

news

కోలీవుడ్‌లో చెడు సంస్కృతి పెరుగుతోంది : విశాల్ ఆందోళన

తమిళనాడు చిత్రపరిశ్రమలో చెడు సంస్కృతి పెరిగిపోతోందని హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ...

news

ఆర్థిక కష్టాలు.. తమిళ దర్శక నిర్మాత సూసైడ్

ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ఓ తమిళ దర్శక నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక చెన్నై ...