Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెహబూబాతో పోల్చితే పోకిరి ఫ్లాప్: రామ్ గోపాల్ వర్మ

సోమవారం, 22 జనవరి 2018 (09:35 IST)

Widgets Magazine
ram gopal varma

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు డైరక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడనే విషయం తెలిసిందే. వర్మ-పూరీ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా తన కుమారుడు ఆకాష్‌ను హీరోగా పెట్టి 'మెహబూబా' పేరిట ఓ సినిమాకు పూరీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వర్మకు పూరీ చూపించాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసిన వర్మ తనదైన శైలిలో కామెంట్లు పెట్టారు.
 
'మెహబూబా'లోని కొన్ని సన్నివేశాలను చూశానని.. ఈ సినిమాతో పోలిస్తే 'పోకిరి' ఫ్లాప్‌ అంటూ షాకింగ్ కామెంట్ ఇచ్చాడు. తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో పూరీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీశాడని ప్రశంసలు కురిపించాడు. దీనిపై పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు. "మా బాస్ మొదటిసారి నన్ను చిత్ర దర్శకుడిగా గుర్తించాడు. నా జీవితంలో ఇదే పెద్ద ప్రశంస. లవ్ యు సర్" అంటూ కామెంట్ పెట్టాడు.
 
ఇదిలా ఉంటే.. రాంగోపాల్ వర్మ సంచలన దర్శకుడు. అతడు ఏం మాట్లాడినా సంచలనమే. ఓ వైపు సినిమాలు తీస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఏకంగా పోర్న్ స్టార్‌తో ఓ లఘు చిత్రాన్ని తీస్తున్నారు. అయితే ఇది ఒక సినిమా కాదని, షార్మ్ ఫిల్మ్ కాదని, వెబ్ సిరీస్ కూడా కాదని.. ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వాగతమని వర్మ చెప్తున్నారు. ఈ సినిమాపై మహిళా సంఘాలు మండిపడుతున్నప్పటికీ వర్మ తన సినిమాను విడుదల చేయడంపై మనసు పెట్టాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ పిలుపుతో వైజాగ్ వెళ్లిన వారిలో నేనూ ఉన్నా : కత్తి మహేష్

ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ...

news

'పద్మావత్‌'కు చిక్కులు... గుజరాత్ మల్టీప్లెక్స్ నిరాకరణ

బాలీవుడ్ చిత్రం 'పద్మావత్'కు చిక్కులు తిప్పలేదు. ఈ చిత్ర ప్రదర్శనకు సుప్రీంకోర్టు ...

news

సికింద్రాబాద్ చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్థలు ...

news

''భాగమతి'' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు డార్లింగ్ వస్తున్నాడా?

లేడి సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకున్న అనుష్క శర్మ తాజాగా ''భాగమతి'' సినిమాలో నటిస్తోంది. ...

Widgets Magazine