మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (12:18 IST)

''యాపిల్ సిడర్ వెనిగర్'' తాగండి అంటున్న సమంత.. ఎందుకు?

అందరినీ ఆకట్టుకునే అందం సమంత సొంతం. మధ్య తరగతి కుటుంబం నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన సమంత.. తన ప్రేమికుడు.. అక్కినేని నాగేశ్వర రావు మనువడు, నాగార్జున కుమారుడు, హీరో నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిస

అందరినీ ఆకట్టుకునే అందం సమంత సొంతం. మధ్య తరగతి కుటుంబం నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన సమంత.. తన ప్రేమికుడు.. అక్కినేని నాగేశ్వర రావు మనువడు, నాగార్జున కుమారుడు, హీరో నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

పెళ్లయ్యాక కూడా సినిమా షూటింగ్‌ల్లో బిజీ బిజీగా వున్న సమంత.. తాజాగా తన బ్యూటీ సీక్రెట్‌ను బయటపెట్టింది. 'యాపిల్ సిడర్ వెనిగర్' తన బ్యూటీకి కారణమని చెప్పుకొచ్చింది. 'ప్రతి రోజూ ఉదయం పరగడుపున యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకోండి' అంటూ తన అభిమానులకు సూచించింది. గూగుల్‌లో వెతికితే మరెన్నో రెసిపీలు కనపడతాయని సమంత తెలిపింది.
 
వైద్యులు కూడా యాపిల్ సిడర్ వెనిగర్ బరువు తగ్గేందుకు.. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు. రోజుకు రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే బరువు తగ్గొచ్చునని వారు అంటున్నారు. ఇది మెటబాలిజాన్ని మెరుగుపరిచి.. కొవ్వును నిల్వవుంచదు. తద్వారా కొవ్వు కరిగిపోతుంది. రోజుకు మూడుసార్లు ఆహారానికి ముందు ఐదు ఎమ్ఎల్ మోతాదులో దీన్ని తీసుకుంటే బరువు సమస్య నుంచి బయటపడొచ్చునని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
 
అయితే పరగడుపున ఐదు ఎమ్ఎల్ మోతాదులో మాత్రమే దీన్ని తీసుకోవాలని.. అధికంగా తీసుకోకూడదని వారు హెచ్చరిస్తున్నారు. అలా ఎక్కువగా తీసుకుంటే.. దంతాలపై వున్న ఎనామల్ పాడవుతుందని, గొంతు సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు వారు చెప్తున్నారు. యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకున్నాక నోటిని పుక్కిలించాలి. అలా చేస్తే దంతాల ఎనామల్‌ను కాపాడినట్లవుతుంది. ఇంకా యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకున్న 30 నిమిషాల తర్వాత బ్రష్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.