ఎన్టీఆర్ బయోపిక్‌కు బ్రేక్.. వీవీవీతో బాలయ్య.. జోడీ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో నందమూరి హీరో బాలకృష్ణ.. తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకోవడంతో.. బాలకృష్ణ పలువురు అగ్ర దర్శకులతో చర్చలు జ

selvi| Last Updated: బుధవారం, 16 మే 2018 (15:44 IST)
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో నందమూరి హీరో బాలకృష్ణ.. తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకోవడంతో.. పలువురు అగ్ర దర్శకులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 
 
నిజానికి బాలకృష్ణ తదుపరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించాల్సింది. కానీ బోయపాటి వేరే చిత్రంతో బిజీగా ఉండటంతో, వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే వి.వి.వినాయక్‌, బాలకృష్ణ కలిసి నటించిన ''చెన్నకేశవరెడ్డి'' బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 
 
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. బాలకృష్ణ, శ్రియ సక్సెస్ జోడీ. ఇప్పటికే ఈ జంట మూడుసార్లు కలిసి నటించింది. ప్రస్తుతం వీవీ వినాయక్‌ సినిమా శ్రియ బాలయ్యతో నటిస్తే నాలుగోసారి నటించినట్లవుతుంది. అంతేగాకుండా శ్రియ పెళ్లి తర్వాత తెలుగులో అంగీకరించిన సినిమా ఇదే కావడం గమనార్హం.దీనిపై మరింత చదవండి :