Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవును.. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను: గాయని చిన్మయి

మంగళవారం, 13 మార్చి 2018 (14:00 IST)

Widgets Magazine

గాయని చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న చిన్మయి.. టాలీవుడ్ అగ్రహీరోయిన్, అక్కినేని నాగార్జున కోడలు సమంతకు గొంతునిస్తోంది. సమంతకు చిన్మయి గొంతు బాగా సూటైపోయిన తరుణంలో.. చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో లైంగిక ఇబ్బందులకు ఎదుర్కొన్నట్లు కొందరు నోరు విప్పి నిజాలను బయటకు చెప్పేస్తున్న తరుణంలో చిన్మయి కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. 
 
తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా చిన్మయి వెల్లడించింది. ఇటీవల తాను ఓ కార్యక్రమానికి హాజరయ్యాయని.. అక్కడ ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తనను లైంగికంగా తాకాడని చిన్మయి ట్విట్టర్లో వెల్లడించింది. చాలామంది పురుషులు, మహిళలు చిన్నతనంలోనే లైంగికంగా వేధింపులకు గురైన వారేనని తెలుసుకుని షాక్ అయ్యానని తెలిపింది. 
 
చిన్నారులు తమ ఉపాధ్యాయులు, అంకుల్స్ చివరకు మహిళలచే వేధింపులకు గురైన వారు వున్నారని చిన్మయి ట్వీట్ చేసింది. సమాజంలో ఇళ్లు, బస్సులు, విద్యాసంస్థల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లోనూ లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చిన్నారులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో చెప్పుకునేందుకు ధైర్యం చాలట్లేదని తెలిపింది. 
 
ఇంకా చెప్పినా వారు నమ్ముతారో లేదోననే అనుమానంతో కామ్‌గా వుండిపోతున్నారని.. పురుషులు చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైనట్లు బయటికి చెప్తే హేళన చేస్తారని చాలామంది దాచేసుకుంటున్నారని తెలిపింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని చిన్మయి ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలీవుడ్‌లో అలాంటి వారా? ముందు పడకగదికి.. ఆపై ఆర్థిక ఇబ్బందులు.. కంగనా ఎంట్రీ?

హేట్ స్టోరీ ఫేమ్, దర్శకనిర్మాత వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌లో ...

news

'రంగ‌స్థ‌లం' గురించి క్లారిటీ ఇచ్చేసిన సుక్కు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ...

news

''అర్జున్ రెడ్డి''లో హీరోయిన్‌గా సుబ్బులక్ష్మి: అబ్బే అవన్నీ పుకార్లే గౌతమి

సీనియర్ నటి గౌతమి.. సినీ లెజెండ్ కమల్ హాసన్‌తో తెగతెంపులు చేసుకుంది. ప్రస్తుతం ...

news

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం రోల్ కోసం.. డర్టీ పిక్చర్ హీరోయిన్?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటుడు, మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారకరామారావు ...

Widgets Magazine