ఎం.ఎల్.ఏగా నందమూరి కళ్యాణ్ రామ్ (వీడియో)

ఆదివారం, 14 జనవరి 2018 (16:08 IST)

mla movie still

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న "ఎంఎల్‌ఏ" సినిమా టీజర్ రిలీజైంది. సంక్రాంతి కానుకగా 39 సెకన్లున్న ఈ టీజర్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు మంచి లక్షణాలున్న అబ్బాయి అన్నది ట్యాగ్ లైన్. టీజర్‌లో "వస్తున్నాడు వచ్చేస్తున్నాడు మన ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ.." అన్న డైలాగ్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.
 
ఎమ్మెల్యే గెటప్‌లో హీరో స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకోవడం, కండువా వేసుకోవడం ఆకట్టుకుంటోంది. ఇందులో కల్యాణ్‌‌రామ్‌కి సరసన కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'లక్ష్మీ కల్యాణం' తర్వాత కల్యాణ్‌రామ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న రెండో సినిమా ఇది. ఉపేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భరత్‌ చైదరి, కిరణ్‌ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది.దీనిపై మరింత చదవండి :  
Kalyanram Kajal Mla Release

Loading comments ...

తెలుగు సినిమా

news

సందడి చేసిన బాలయ్య... ఫ్యాన్స్‌తో కలిసి ‘జై సింహా’ తిలకించిన నేత

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ...

news

'సైరా' సీక్రెట్స్ వెల్లడించిన చిరంజీవి...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం గత ...

news

మహిళా అభిమానిని బూతులు తిట్టిన బాలీవుడ్ హీరో (వీడియో)

వివాదాలకు ప్రత్యేక చిరునామాగా మారిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ క‌పూర్. ఈయన గురించి ...

news

రాముడు - పాండవులు చేసిందే తప్పే అయితే... నేను చేసింది తప్పే... గాయత్రి టీజర్

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ ...