మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 జులై 2018 (13:19 IST)

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో టాలీవుడ్ నటుడు మృతి...

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‍తో టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూశారు. ఆయన పేరు వినోద్. హీరోగా ప్రస్థానం మొదలు పెట్టి.. ఎన్నో సినిమాల్లో విలన్‌గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించా

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‍తో టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూశారు. ఆయన పేరు వినోద్. హీరోగా ప్రస్థానం మొదలు పెట్టి.. ఎన్నో సినిమాల్లో విలన్‌గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. ఈయన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోయారు. 
 
ఆయన అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత పేరును వినోద్‌గా మార్చుకున్నారు. ఈయన అన్ని భాషల్లో కలిపి సుమారు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. 
 
ఈయన తొలి చిత్రం "కీర్తికాంతకనకం". 1980లో వి. విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాలో వినోద్ హీరోగా నటించారు. విక్టరీ వెంకటేష్ - మీనా నటించిన 'చంటి' సినిమాతో బాగా ఫేమస్ అయిన ఆయన ఆ తర్వాత 'లారీ డ్రైవర్', 'ఇంద్ర' వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 
 
28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు.  వినోద్‌కు భార్య వీనావతి, పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వినోద్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వినోద్ మృతివార్త తెలియగానే 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికెళ్లి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.