శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Preeti
Last Modified: శుక్రవారం, 1 జూన్ 2018 (15:41 IST)

రహస్య వివాహం గురించి నిజం బయటపెట్టిన త్రిష....

తెలుగు, తమిళ పరిశ్రమలలో త్రిష మొన్నటిదాకా స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయ్యింది. దాదాపు పెద్ద స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. హిట్ సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈమె ఇప్పుడు సరైన అవకాశాలు లేకపోవడంతో కాస్త కనుమరుగయ్యింది. అయితే అప్పుడప్పుడు పెళ

తెలుగు, తమిళ పరిశ్రమలలో త్రిష మొన్నటిదాకా స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయ్యింది. దాదాపు పెద్ద స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. హిట్ సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈమె ఇప్పుడు సరైన అవకాశాలు లేకపోవడంతో కాస్త కనుమరుగయ్యింది. అయితే అప్పుడప్పుడు పెళ్లి విషయంలో మీడియాకెక్కుతూనే ఉంది ఈ అమ్మడు. కొంతకాలం క్రితం వరుణ్ మణియన్‌తో త్రిష పెళ్లి ఫిక్స్ అయ్యి తర్వాత రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో నిశ్చితార్థంలోనే ఆగిపోయింది. 
 
వరుణ్ కుటుంబ సభ్యులు పెళ్లయ్యాక త్రిష సినిమాల్లో నటించకూడదని త్రిషకు ఖరాఖండీగా చెప్పేసారట. అయితే త్రిష దీనికి ఏమాత్రం ఒప్పుకోలేదట.. ఈ కారణంగానే వరుణ్ కుటుంబ సభ్యులు పెళ్లి క్యాన్సిల్ చేసారనే వార్తలు ఈమధ్య జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇదిలావుంటే ఈమధ్య త్రిషకు మళ్లీ పెళ్లయిపోయిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
మొదటి పెళ్లి ప్రయత్నం విఫలం కావడంలో రెండో పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిందట త్రిష. అందుకే సీక్రెట్‌గా ఉంచిందట. ఈ వార్తలపై స్పందించింది త్రిష తన పెళ్లి గురించి వస్తున్న కథనాలలో ఏ మాత్రం నిజం లేదని, ప్రేమ పెళ్లే చేసుకుంటానని, మనస్సుకు నచ్చిన వ్యక్తి దొరకగానే అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటా’ అని స్పష్టంగా చెప్పింది. దీనితో మీడియాలో ఆమె పెళ్లిపై వస్తున్న వార్తలకు తెరపడిందనే చెప్పాలి.