శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (10:29 IST)

కాస్టింగ్ కౌచ్‌పై పవన్ స్పందన.. ఇట్స్ ఓకే.. బట్ అసంతృప్తే: శ్రీరెడ్డి

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై అర్ధనగ్న ప్రదర్శనతో పోరు బాట పట్టిన శ్రీరెడ్డి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించాలని కోరింది. ఈ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్‌పై పవన్

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై అర్ధనగ్న ప్రదర్శనతో పోరు బాట పట్టిన శ్రీరెడ్డి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించాలని కోరింది. ఈ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్‌పై పవన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ పవన్ స్టేట్మెంట్‌పై శ్రీరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసింది.
 
''పవన్ కల్యాణ్ సార్ స్టేట్ మెంట్ నాకేమీ ఆనందాన్ని కలిగించలేదు. అయితే ఇట్స్ ఓకే. ఇతర మహిళల రక్షణపై మాట్లాడటం, నన్ను తక్కువ చేయడం అర్థం కాలేదు. ఇట్స్ ఫైన్. నేనేమీ జలసీగా లేను. ప్రజల దృష్టి నాపై పడాలని నేనేమీ కోరుకోవడం లేదు. ఇతరుల మాదిరిగా నాకేమీ పాప్యులారిటీ అవసరం లేదు'' అని శ్రీరెడ్డి తెలిపింది.
 
అంతకుముందు ట్వీట్‌లో పవన్ మహిళల సమస్యలపై మాట్లాడటం సంతోషాన్నిచ్చిందని చెప్పింది. ఆయనలాంటి తారలు స్పందిస్తే.. అసాంఘిక కార్యకలాపాలపై త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని శ్రీరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసింది.