శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (12:25 IST)

ఎమ్మెల్యే వద్దు కౌన్సిలర్‌గా పోటీ చేస్తా : జేసీ ప్రభాకర్ రెడ్డి

సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే జేసీ బ్రదర్స్‌లలో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాడిపత్రి శాసనసభ్యుడుగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నేత ఇపుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్

సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే జేసీ బ్రదర్స్‌లలో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాడిపత్రి శాసనసభ్యుడుగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నేత ఇపుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని, కౌన్సిలర్‌గా మాత్రమే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.
 
పట్టణంలోని కొత్త పెన్నా బ్రిడ్జి వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పార్కుకు ఎమ్మెల్యే జేసీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీచేస్తానని తెలిపారు. కౌన్సిలర్‌గా ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు పట్టణాభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. 
 
అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో నా కుమారుడు అశ్మిత్‌ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల బడతాడంటూ ప్రకటించారు. నా మీద ఉన్న ప్రేమ, ఆదరాభిమానాలే నా కుమారుడి పట్ల చూపాలని కోరారు. 
 
మొదటినుంచీ తనకు ప్రజలే బలం, బలహీనత అన్నారు. వారి కారణంగానే తాను ఇంతవాడినయ్యానన్నారు. తన లక్షణాలను పుణికి పుచ్చుకున్న జేసీ అశ్మిత్‌ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తాడని తెలిపారు.