Widgets Magazine

బ్రెడ్‌తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (13:23 IST)

కావలసిన పదార్థాలు:
బ్రెడ్‌ ముక్కలు - 7 
నూనె - 2 స్పూన్స్ 
సోంపు - 1 స్పూన్  
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
తరిగిన క్యారెట్‌, క్యాప్సికమ్‌ - 2 కప్పులు 
టమోటాలు - 2 
పచ్చిమిర్చి - 3 
కారం - 2 స్పూన్స్ 
పసుపు - 1 స్పూన్ 
గరం మసాలా - 2 స్పూన్స్ 
ధనియాల పొడి - 1 స్పూన్ 
కొత్తిమీర, పుదీన - 1 కప్పు 
పెరుగు - అర కప్పు 
చక్కెర - 1 స్పూన్ 
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని పెనం మీద కాల్చుకోవాలి. ఆ తరువాత ఒక బాణలిలో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, సోంపు వేసి వేయించి తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు పాటు బాగా వేయించి టమోటాలు, ఉప్పు, చక్కెర కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

ఆ తరువాత క్యాప్సికమ్‌, క్యారెట్‌, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు వేసి అర గ్లాసు నీళ్లు పోసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించాలి. చివరగా బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కలిపి చిన్నమంట మీద మరో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే వేడి వేడి బ్రెడ్ బిర్యానీ రెడీ.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

క్యారెట్ సూప్ ఎలా చేయాలో తెలుసా?

క్యారెట్స్‌లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. ...

news

పెసర మెులకలతో పకోడీలా... ఎలా చేయాలో చూద్దాం...

జీర్ణశక్తికి పెంచుటకు మెులకలు చక్కగా పనిచేస్తాయి. వీటి వలన ఎంజైముల పనితీరు ...

news

గసగసాలతో పులావ్ ఎలా చేయాలో తెలుసా...?

గసగసాలు నిద్రలేమి వంటి సమస్యలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను ...

news

సేమియాతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసా?

కావలసిన పదార్థాలు: సేమియా - అర కేజి నిమ్మకాయ - 1 చికెన్ ‌- అర కేజి పచ్చిమిర్చి - ...

Widgets Magazine