Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోటీలకు సూటయ్యే క్యాప్సికమ్ టమోటో పచ్చడి

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (11:44 IST)

Widgets Magazine

రోటీలు, చపాతీలకు ఆలూ కర్రీ, చికెన్, మటన్ గ్రేవీలు తయారు చేసి బోర్ కొట్టేసిందా..? అయితే సింపుల్‌గా క్యాప్సికమ్ టమోటా పచ్చడి ట్రై చేయండి. క్యాప్సికమ్‌లో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా వుంటాయి. శరీరబరువును అదుపులో ఉంచడానికి క్యాప్సికమ్‌ తోడ్పడుతుంది. గుండె సంబంధిత వ్యాధులను క్యాప్సికమ్ దూరం చేస్తుంది.

డయాబెటిస్‌కు చెక్ పెడుతుంది. అలాగే టమోటాను రోజు ఆహారంలో చేర్చుకుంటే, బరువును నియంత్రించుకోవచ్చు. టమోటాలో క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. తద్వారా శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ఈ రెండింటి కాంబోలో క్యాప్సికమ్ టమోటా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
క్యాప్సికమ్ ముక్కలు - రెండు కప్పులు 
టమోటా ముక్కలు - రెండు కప్పులు
పచ్చిమిర్చి తరగు - పావు కప్పు 
పల్లీలు - రెండు స్పూన్లు 
సెనగపప్పు - రెండు స్పూన్లు 
జీలకర్ర - ఒక స్పూన్ 
తాలింపుకు - నూనె, పోపు 
నూనె, ఉప్పు - తగినంత 
మినపప్పు - ఒక స్పూన్ 
 
తయారీ విధానం :
స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేసి పల్లీలు వేసి వేగాక తీసి పక్కనబెట్టుకోవాలి. అందులో మినపప్పు, సెనగపప్పు వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమోటా ముక్కలను వేసి బాగా వేపాలి. వేగాక తగినంత ఉప్పు చేర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు ఆరనివ్వాలి.

తర్వాత మిక్సీలో పల్లీలు, సెనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసి పచ్చడికి తగినట్టు రుబ్బుకోవాలి. ఆపై క్యాప్సికమ్, టమోటా, కొత్తిమీర, జీలకర్ర వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకుని.. బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేగాక తాలింపు దినుసులతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించి పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి రోటీల్లోకి భలేగుంటుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

మిరియాలతో రొయ్యల మసాలా ఎలా చేయాలి...?

బాణలిలో నూనె పోసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి పేస్టును చేర్చి బాగా వేపుకుని.. పచ్చిమిర్చి ...

news

వంటింటి చిట్కాలు: ఆకుకూరతో వేరుశెనగల్ని చేర్చి ఉడికిస్తే?

వంటనూనెలో రెండు మూడు మిరపకాయ వడియాలను వేసివుంచితే చాలారోజుల వరకు చెడకుండా వుంటుంది. రసం ...

news

శెనగలతో పిల్లల కోసం టేస్టీ చాట్

పిల్లల స్నాక్స్ బాక్సును షాపుల్లో అమ్మే స్నాక్సులతో నింపేస్తున్నారా? చిప్స్ వంటి ...

news

శీతాకాలంలో మిర్చి మంచిదే..

శీతాకాలంలో మిర్చి ఆహారంలో చేర్చుకోవాలంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిర్చీలో ...

Widgets Magazine