సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (20:52 IST)

టీడీపితో కలిసి వున్నప్పుడే బాగుంది... అమిత్ షాపై అంతెత్తు లేచిన కంభంపాటి

భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపైనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎపి బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. మీరిచ్చిన పదవి నాకొద్దు.. మీ పదని మీరే ఉంచుకోండంటూ ఏకంగా ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది. ఏ క్షణం ఏ

భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపైనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎపి బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. మీరిచ్చిన పదవి నాకొద్దు.. మీ పదని మీరే ఉంచుకోండంటూ ఏకంగా ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని లోలోపల బాధపడిపోతున్నా... టిడిపితో కలిసి ఉన్నప్పుడు బాగుంది. విడిపోయిన తరువాత పరిస్థితి మరీ హీనంగా మారిపోయింది. ఎందుకిలా జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. 
 
ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. విడిపోయిన పార్టీలోని నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు అస్సలు బోధపడటం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకుంటే బాగుంటుందని నేనే స్వయంగా వారికి చెప్పా. కానీ వినిపించుకోలేదు. ఇది జరుగుతుండగానే నేనున్న పదవిలో మరో వ్యక్తిని కూర్చోబెట్టేందుకు సిద్థమయ్యారు. నన్ను కనీసం అడగకుండా.. నా సలహాలు తీసుకోకుండా ఎలా నన్ను పదవి నుంచే తీయడానికి సిద్థమయ్యారని జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ప్రశ్నించారు కంభం పాటి హరిబాబు. 
 
ఆయన రాసిన లేఖ ఇప్పుడు పార్టీలో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి, క్రిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయాల్సిన నాయకుడు ఇలా అధిష్టానం మీదే తిరుగుబావుటా ఎగరేయడం ఏమిటని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. హరిబాబు రాసిన లేఖకు అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.