Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్ సీఎం కావాలి... ప్రత్యేక రొట్టెను అందుకున్న అనిల్ కుమార్ యాదవ్

మంగళవారం, 3 అక్టోబరు 2017 (17:03 IST)

Widgets Magazine
Jagan

మత సామరస్యానికి ప్రతీక అయిన రొట్టెల పండుగ నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గాలో మూడు రోజుల క్రితం ప్రారంభమైంది. ఈ పండుగ సందర్భంగా భక్తులు తమ కోర్కెలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి, అదే కోరికను అప్పటికే తీర్చుకున్న వారితో వాటిని మార్పిడి చేసుకోవడం ఆనవాయతీ. ఈ పండుగలో నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
 
బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువులో ప్రత్యేక రొట్టెను అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రానికి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల వివరాలను ఇంటింటికి వెళ్లి తెలియజేసే కార్యక్రమాన్ని అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. అన్న వస్తున్నాడు.. అనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలియపరుచవచ్చునని అనిల్ కుమార్ వెల్లడించారు.

కాగా నవంబర్ 2న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ మహాపాదయాత్ర మొదలు కానుంది. దీనికి ఒకరోజు ముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత తిరుమల నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. అక్కడ నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నారని సమాచారం. ఇప్పటికే జగన్ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను వైసీపీ సిద్ధం చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హనీప్రీత్‌ అరెస్టు.. తండ్రి తాకడం కూడా తప్పేనా?

డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ అలియాస్ డేరా బాబా దత్తపుత్రికగా చెపుతున్న హనీప్రీత్ ఇన్సాన్‌ను ...

news

నాకంటే ముందెళ్తావా... బాలయ్య మళ్లీ ఏసేశాడు...

బాలకృష్ణకు బాగా ప్రేమ ఎక్కువయితే ఏం చేస్తాడో తెలుసా... దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన మాట ...

news

నాది రెండు కళ్ల సిద్ధాంతం కాదు.. చంద్రబాబే మా నేత : మోత్కుపల్లి

గవర్నర్ పదవి వస్తుందని గత మూడేళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నట్టు c

news

మళ్లీ మొదటికొచ్చిన ఓపిఎస్ - ఇపిఎస్.. అదీ శ్రీవారి చెంతే..!

అన్నాడిఎంకేలో బద్ధశత్రువులుగా ఉన్న పళణిస్వామి, పన్నీరుసెల్వంలు కలిసిపోయారు. దీంతో కథ ...

Widgets Magazine