శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (18:36 IST)

బాలక్రిష్ణను ఓడించేందుకు వ్యూహం పన్నుతున్న యువ ఎంపి...

నందమూరి బాలక్రిష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలక్రిష్ణ హిందూపురంలో భారీ మెజారిటీతోనే గెలిచారు. అయితే ప్రజలకు బాలక్రిష్ణ అందుబాటులో లేరన్న విమర్శలు లేకపోలేదు. అభివృద్ధి కూడా అంతంతమాత్రమేనని త

నందమూరి బాలక్రిష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలక్రిష్ణ హిందూపురంలో భారీ మెజారిటీతోనే గెలిచారు. అయితే ప్రజలకు బాలక్రిష్ణ అందుబాటులో లేరన్న విమర్శలు లేకపోలేదు. అభివృద్ధి కూడా అంతంతమాత్రమేనని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హిందూపురం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని వైసిపి భావిస్తోంది. 
 
జగన్ స్వయంగా ఒక ఎంపిని రంగంలోకి దింపాడు. బాలక్రిష్ణను ఎలాగైనా ఓడించాలని పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళాలని చెప్పాడట. ఆ ఎంపి ఎవరో కాదు మిథున్ రెడ్డి. రాజంపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న బాలక్రిష్ణను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు పక్కా వ్యూహాలను సిద్థం చేసుకున్నారు. గత ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ పోటీ చేయగా, ఈ సారి ఆయనకు సీటు ఇచ్చే అవకాశం లేదట. 
 
హిందూపురంలో వాల్మీకీ బోయ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో అలాంటి వ్యక్తినే వైసిపి అభ్యర్థిగా పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే అలాంటి అభ్యర్థిని ఎంపి మిథున్ రెడ్డి సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వైసిపి వ్యూహంతో బాలక్రిష్ణ వచ్చే ఎన్నికల్లో ఓడుతారా లేకుంటే గెలుస్తారా అన్నది వేచి చూడాల్సిందే.