అల్పాహారం-చిట్కాలు... అదిరిపోయే టేస్ట్ గ్యారెంటీ

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (16:41 IST)

Dosa

ఉదయం పూట అల్పాహారం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ క్రింది చిట్కాలను ఒకసారి చూడండి.

1. ముదిరిపోయిన ఆనప గింజల్ని బియ్యంతో కలిపి నానబెట్టి రుబ్బి దోసెల్లా పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
 
2. అరకిలో చపాతి పిండికి రెండు మగ్గిన అరటి పండ్లు, ఒక కప్పు పెరుగు చొప్పున కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి.
 
3. మిగిలిపోయిన అన్నంలో ఎర్రకారం, జీలకర్ర కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగా పెట్టుకొని ఎండాక వేయించుకొని తింటే భలే రుచి. అయితే వడియాలను చీరల మీద, చాపల మీద కాకుండా ప్లాస్టిక్ టేబుల్ క్లాత్ మీద కాని పాలిథీన్ పేపర్ మీద కాని పెడితే ఎండాక తీసుకోవటం చాలా తేలిక.
 
4. పూరీలు చేసేందుకు పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే చాలాసేపటి వరకు తాజాగా ఉంటాయి.
 
5. ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు రెండు ఆముదం చుక్కలు వేసి రుబ్బితే ఇడ్లీ మెత్తగా వస్తుంది.
 
6. నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కల మీద మెత్తని ఉప్పు వేసి బాగా కలిపితే అవి తడి అవుతాయి. వాటిని కొంచెం శనగ పిండితో కలిపి వేయించుకుంటే పకోడీలు కరకరలాడుతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

రోటీలకు సూటయ్యే క్యాప్సికమ్ టమోటో పచ్చడి

స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేసి పల్లీలు వేసి వేగాక తీసి పక్కనబెట్టుకోవాలి. ...

news

మిరియాలతో రొయ్యల మసాలా ఎలా చేయాలి...?

బాణలిలో నూనె పోసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి పేస్టును చేర్చి బాగా వేపుకుని.. పచ్చిమిర్చి ...

news

వంటింటి చిట్కాలు: ఆకుకూరతో వేరుశెనగల్ని చేర్చి ఉడికిస్తే?

వంటనూనెలో రెండు మూడు మిరపకాయ వడియాలను వేసివుంచితే చాలారోజుల వరకు చెడకుండా వుంటుంది. రసం ...

news

శెనగలతో పిల్లల కోసం టేస్టీ చాట్

పిల్లల స్నాక్స్ బాక్సును షాపుల్లో అమ్మే స్నాక్సులతో నింపేస్తున్నారా? చిప్స్ వంటి ...