శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By tj
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (15:28 IST)

చెన్నైలో బిర్యానీ తింటున్నారా? ఇది చదివితే షాక్ తప్పదు?

మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయా

మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయాలు చెన్నైలో బయటపడ్డాయి. చెన్నైలోని కొన్ని ప్రధాన ప్రాంతాలల్లో నివాసముండే కొంతమంది ప్రముఖులు తమ ఇళ్ళలో పిల్లులను పెంచుకుంటున్నారు. అయితే ఆ పిల్లులు గత నెలరోజులుగా కనిపించకుండా పోతున్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పిల్లుల యజమానులు.
 
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిల్లులను ఎవరు దొంగిలిస్తున్నారని విచారణ జరుపుతుండగా ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. అదే పిల్లులను చంపి బిర్యానీ వండేస్తున్నారు షాపుల యజమానులు. 
 
చెన్నైలోని ఆవడి, పల్లావరం, తిరుముల్లయ్ వోయల్, కన్నికాపురమ్ వంటి ప్రాంతాల్లో బిర్యానీలలో పిల్లులు ఎక్కువగా వండుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చికెన్, మటన్ బిర్యానీలంటూ పిల్లులను చంపి శుభ్రం చేసి వీటిలో వేసి వండేస్తున్నారట. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇంకా బిర్యానీ షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు.