శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi

మధుమేహులకు మేలు చేసే ఆహారం

కొన్ని రకాల మాంసకృత్తులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు, రక్త ప్రసరణలో ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చు. చేపలు, మాంసం, పప్పుదినుసులు, కేబేజీ పువ్వు, బచ్చలికూర, పాల ఉత్పత్తుల్లో లభించే మాంసకృత్తులు, ర

కొన్ని రకాల మాంసకృత్తులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు, రక్త ప్రసరణలో ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చు. చేపలు, మాంసం, పప్పుదినుసులు, కేబేజీ పువ్వు, బచ్చలికూర, పాల ఉత్పత్తుల్లో లభించే మాంసకృత్తులు, రక్తపోటు, రక్త ప్రసరణ సమస్యలను మాత్రమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను సైతం నయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అమైనో ఆమ్లం అధికంగా ఉండే ఆహార పదార్థాలు హృదయానికి రక్షణ కవచంగా వుంటాయి.
 
మధుమేహులు ప్రతిసారి భోజనాన్ని తప్పనిసరిగా సలాడ్‌తో ప్రారంభించాలి. భోజనంలో ఎక్కువ కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ఎక్కువ కేలరీలను అందించే ధాన్యాలు, నూనెలు, గింజలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీలైనంత నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలనే ఎక్కువగా తీసుకోవాలి. ఫలితంగా రక్తంలో విడుదలయ్యే గ్లూకోజ్ తక్కువ మొత్తంలో ఉంటుంది. 
 
ప్రతి రోజు మెంతులు తీసుకోవడం మధుమేహం ఉన్న వారికి ఎంతో మంచిది. మెంతులు ఆహారం నుంచి గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి రోజు మెంతులు తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ప్రతిసారీ ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా ఒకచెంచా మెంతులపొడి నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.